Vu Dolby Atmos సౌండ్ బార్ QLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Vu Dolby Atmos సౌండ్ బార్ QLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

సౌండ్ బార్ మరియు స్మార్ట్ టీవీ జంటగా చాలా తక్కువ ధరలో కోరుకునే వారు ఈ స్మార్ట్ టీవీ డీల్ ను చూడవచ్చు

ఈ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది

Vu Dolby Atmos సౌండ్ బార్ QLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. సౌండ్ బార్ మరియు స్మార్ట్ టీవీ జంటగా చాలా తక్కువ ధరలో కోరుకునే వారు ఈ స్మార్ట్ టీవీ డీల్ ను చూడవచ్చు. ఈ టీవీ మంచి సౌండ్ అందించే సౌండ్ బార్ మరియు గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఈ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.

Vu Dolby Atmos Smart Tv: ఆఫర్

వియు ఇండియాలో సౌండ్ బార్ సిరీస్ నుంచి అందించిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని 38% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,750 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Vu Dolby Atmos Smart Tv: ఫీచర్స్

ఈ వియు స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన A+ గ్రేడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్యూలెడ్ స్క్రీన్, డాల్బీ విజన్ సపోర్ట్, 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, HDR10, HLG మరియు 400 నిట్స్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ AI Processor తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ మంచి సెటప్ కలిగి ఉంటుంది. ఈ టీవీ తో జతగా ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 88W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. అదనంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు మ్యూజిక్ ఎకో సిస్టం వంటి ఫీచర్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 3 HDMI, 2 USB, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Also Read: OnePlus Nord CE6 Lite: భారీ ఆఫర్స్ తో మొదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.!

ఈ సౌండ్ బార్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ టీవీని ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :