Oppo Find X10 and X10 Pro Max launching with stunning camera
రేపు రిలీజ్ కాబోతున్న Oppo Find X10 అండ్ X10 Pro Max కెమెరా గురించి తెలిస్తే మతిపోతుంది. ఏంటి బ్రో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి అలా చెబుతున్నారు, అని మీరు అనుకోవచ్చు. కానీ, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా గురించి కంపెనీ చేస్తున్న టీజింగ్ మరియు ఎప్పటి వరకు రివీల్ చేసిన ఫీచర్స్ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పటి వరకు మార్కెట్లో 200MP ఎంపీ కెమెరాతో స్మార్ట్ ఫోన్స్ వచ్చిన మాట నిజమే, కానీ డ్యూయల్ మరియు ట్రిపుల్ 200MP ఎంపీ కెమెరాతో స్మార్ట్ ఫోన్లు ఇప్పటివరకు మార్కెట్లో పరిచయం కాలేదు. ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ లను ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందని చెప్పడం ఆశ్చర్యపరిచింది.
ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా రేపు సాయంత్రం 4 గంటల 45 నిమిషాల సమయంలో మార్కెట్ లో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ సిరీస్ లాంచ్ కోసం నిర్వహించనున్న ప్రత్యేకమైన ఈవెంట్ ద్వారా ఈ ఫోన్ లను లాంచ్ చేస్తుంది.
ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను ప్రీమియం లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో ముందు నుంచే టీజింగ్ చేస్తూ వచ్చింది. వీటిలో ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 స్మార్ట్ ఫోన్లో రెండు 200MP కెమెరాలు కలిగిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే, ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్లో మూడు 200MP కెమెరాలు కలిగిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా 8K వీడియో మరియు 8K అల్ట్రా అల్ట్రా క్లియర్ ఇమేజ్ షూట్ చేసే సత్తా కలిగి ఉంటాయి.
ఈ రెండు కెమెరాలు కూడా 200MP మెయిన్ కెమెరా, 200MP టెలిఫోటో కెమెరా మరియు న్యూ జనరేషన్ ట్రూ కలర్ కెమెరాలు కామన్ గా కలిగి ఉంటాయి. అయితే, ఫైండ్ ఎక్స్ 10 లో 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటే, ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్ ఫోన్ లో 200MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా Hasselblad కెమెరా సిస్టం మరియు కొత్త ఒప్పో టెలి కన్వర్టర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి.
మరింత శక్తివంతమైన ప్రాసెసర్
Also Read: SBI Data Leak: డార్క్ వెబ్ లో బయటపడిన వేలాది కస్టమర్ల వివరాలు..!
ఈ ఫోన్స్ కలిగిన పవర్ ఫుల్ కెమెరాని నడిపించే మరింత శక్తివంతమైన ప్రాసెసర్ ని కూడా ఈ ఫోన్ లలో అందించింది. అవేమిటంటే, ఫైండ్ ఎక్స్ 10 లో మీడియాటెక్ 3nm చిప్ సెట్ Dimensity 9600M ఉంటే, ఫైండ్ ఎక్స్ 10 ప్రో మాక్స్ ఫోన్ లో 2nm చిప్ సెట్ Dimensity 9600 Pro ఉంది. ఇవి మీడియాటెక్ లేటెస్ట్ గా అందించిన న్యూ అండ్ పవర్ ఫుల్ చిప్ సెట్ లు. ఈ ఫోన్ లను 8000 mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కూడా వెల్లడించింది.
ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు రేపు లాంచ్ అవుతాయి కాబట్టి, వీటి ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ తో రేపు కలుద్దాం.