అమెజాన్ GIF Sale నుంచి అతి చవక రేటుకే Smart Glasses సేల్ చేస్తోంది .. డోంట్ మిస్.!

HIGHLIGHTS

స్మార్ట్ గ్లాసెస్ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు అమెజాన్ గుడ్ న్యూస్ అందించింది

భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించి ఎన్నడూ చూడనంత అతి చవక రేటుకే ఆఫర్ చేస్తోంది

అతి చవక రేటుకి లభిస్తున్న Smart Glasses డీల్

ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండ్ గా నడుస్తున్న స్మార్ట్ గ్లాసెస్ కొనాలని చూస్తున్న వారికి ఈ రోజు అమెజాన్ గుడ్ న్యూస్ అందించింది. ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన కొత్త స్మార్ట్ గ్లాస్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించి ఎన్నడూ చూడనంత అతి చవక రేటుకే ఆఫర్ చేస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు అతి చవక రేటుకి లభిస్తున్న Smart Glasses డీల్ ని ఈ రోజు చూద్దాం.

Smart Glasses Deal

Fire-Boltt సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో AI కెమెరా సపోర్ట్ తో Fire-Lens F2 గ్లాస్ ని లాంచ్ చేసింది. ఈ గ్లాసెస్ ని రూ. 19,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో రిలీజ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ కళ్ళజోడును ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఏకంగా రూ. 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 రూపాయల సేల్ ప్రైస్ తో అమ్మడు చేస్తోంది.

ఈ స్మార్ట్ కళ్ళజోడు పై అమెజాన్ అందించిన ఆఫర్స్ లిస్ట్ ఇంకా అయిపోలేదు. ఈ కళ్లజోడు ను అమెజాన్ సేల్ నుంచి ICICI అండ్ Axis క్రెడిట్ కార్డు తో కొనే వారి కోసం రూ. 1,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ గ్లాసెస్ ని కేవలం రూ. 8,999 రూపాయల అతి చవక ధరలో అందుకోవచ్చు. Buy From Here

Fire-Boltt Smart Glasses : ఫీచర్స్

Fire-Boltt అందించిన ఈ Fire-Lens F2 AI కెమెరా స్మార్ట్ గ్లాసెస్ అనేది తమ రోజువారీ జీవితంలో టెక్నాలజీని మరింత సులభంగా ఉపయోగించుకోవాలనుకునే వారికి ఉపయోగపడే స్మార్ట్ గ్లాసెస్. వీటిలో అందించిన 8MP కెమెరా సహాయంతో మొబైల్ ఫోన్‌ ను జేబుల్లోంచి తీయకుండా ఫోటోలు, వీడియోలను హ్యాండ్స్ ఫ్రీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రయాణాలు, స్నేహితులతో గడిపే అందమైన సమయం, టూర్లు, రోజువారీ ప్రత్యేక సందర్భాలు మరియు మీ కళ్ల ముందు కనిపించే ప్రతి విషయాన్ని రికార్డ్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న 32GB స్టోరేజ్ ఎక్కువ ఫోటోలు మరియు వీడియోలు వంటి డేటా ను స్టోర్ చేసుకోవడానికి సహాయపడుతుంది.

ఈ స్మార్ట్ గ్లాసెస్‌ లోని Vision AI ఫీచర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనుభవాలను అందించడానికి రూపొందించబడింది. ఓపెన్ ఇయర్ ఆడియో సదుపాయం ద్వారా హెడ్ ఫోన్ పనిలేకుండా ఆడియో వినవచ్చు. ఇందులో ఉన్న వాయిస్ కంట్రోల్ మరియు టచ్ కంట్రోల్ ఫీచర్లతో అనుకూలమైన పనులు మరింత సులభంగా నిర్వహించుకోవచ్చు.

Also Read: కేవలం 10 వేల బడ్జెట్ లోనే 3.1.2 Dolby ATMOS సౌండ్ బార్ ఆఫర్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

మీరు ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా హ్యాండ్స్ ఫ్రీగా ఉపయోగించుకోవడం ఈ గ్లాసెస్ ప్రత్యేకత. కెమెరా, ఆడియో, AI టెక్నాలజీని ఒకే పరికరంలో పొందాలనుకునే వారికి Fire-Boltt Fire-Lens F2 ఒక ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :