best Tablet Deal under 20k in flipkart big shopping utsav sale
స్మార్ట్ ఫోన్ రేట్లు పెరిగిన తర్వాత ఎక్కువ మంది చూస్తున్న ఆప్షన్ టాబ్లెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, మార్కెట్లో టాబ్లెట్ లకు పెరిగిన డిమాండ్ తో వీటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో 20 వేల రూపాయల ధరలో ఒక మంచి టాబ్లెట్ తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని అనిపిస్తుంది. అయితే, మీరు కూడా 20 వేల ధరలో పవర్ ఫుల్ Tablet Deal కోసం చూస్తుంటే, ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బిగ్ డీల్ ని మిస్ చేసుకోకండి.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిన తర్వాత బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ని అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ ని చాలా బిగ్ డీల్స్ తో బడ్జెట్ ధరలో సేల్ చేస్తోంది. ఇందులో Lenovo Tab Plus ట్యాబ్ పై అందించిన డీల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అదేమిటంటే, ఈ ట్యాబ్ ఈరోజు 37% డిస్కౌంట్ తో కేవలం రూ. 21,499 ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తోంది.
ఈ డిస్కౌంట్ కాకుండా టాబ్లెట్ పై రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ట్యాబ్ కేవలం రూ. 20,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది ఎక్కువ అని అనుకోకండి నేను చెప్పింది ఈ ట్యాబ్ హై ఎండ్ వేరియంట్ పైన అందించిన ఆఫర్.
Also Read: BSNL Kavach Protection 2.0 తో లక్ష రూపాయల బీమా మరియు మరిన్ని బెనిఫిట్స్ అందుకోండి.!
ఈ ట్యాబ్ లో 11.5 అంగుళాల IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 2K పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది వెబ్ సిరీస్ లు మరియు YouTube వీడియోలు చూడటానికి మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ టాబ్లెట్ MediaTek Helio G99 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది రోజువారీ పనులు, వీడియో స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, ఆన్ లైన్ క్లాసులు మరియు సాధారణ గేమింగ్ కు సరిపోతుంది. ఇందులో 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ట్యాబ్ లో ముందు 8MP ఫ్రంట్ కెమెరా మరియు వెనుక 8MP ఆటో ఫోకస్ కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ వీడియో కాల్స్, ఆన్ లైన్ క్లాసులు మరియు డాక్యుమెంట్ ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఈ టాబ్లెట్ లో 8,600mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో గరిష్ఠంగా 45W USB-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఈ ట్యాబ్ లో గొప్ప సౌండ్ సెటప్ అండ్ సపోర్ట్ ని లెనోవో అందించింది. ఈ ట్యాబ్ లో 4 ట్వీటర్లు మరియు 4 ఫోర్స్-బ్యాలెన్స్డ్ బాస్ యూనిట్లతో మొత్తం 8 స్పీకర్ సిస్టం ఉంటుంది. ఈ సెటప్ తో ఇది మొత్తం 26W స్టీరియో ఆడియో అవుట్ పుట్ అందిస్తుంది. అలాగే, ఇది Dolby Atmos సపోర్ట్ మరియు వైర్డ్ హెడ్ ఫోన్లతో Hi-Res Audio సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో సిరీస్ అండ్ ఎం మ్యూజిక్ ని మరింత ఎంజాయ్ చేయవచ్చు.