BSNL Kavach Protection 2.0 offers 1 lakh personal accident cover and more
BSNL Kavach Protection 2.0 కొత్త అప్డేట్ ని బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంవత్సరం మార్చి నెలలో బిఎస్ఎన్ఎల్ కవచ్ ప్రొటెక్షన్ పేరుతో తీసుకొచ్చిన సెక్యూరిటీ సర్వీస్ యొక్క కొత్త అప్డేట్ గా దీన్ని అందించింది. మహిళల మొబైల్ నెంబర్ ని గోప్యంగా ఉంచడమే ప్రధాన లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేకమైన సర్వీస్ ని ఇప్పుడు మరిన్ని లాభాలతో అప్గ్రేడ్ చేయడం జరిగింది.
బిఎస్ఎన్ఎల్ కవచ్ ప్రొటెక్షన్ అనేది 2026 ఉమెన్స్ డే సందర్భంగా మహిళల మొబైల్ నెంబర్ గోప్యత కోసం బిఎస్ఎన్ఎల్ అందించిన కొత్త సెక్యూరిటీ సర్వీస్. ఈ సర్వీస్ లాంచ్ చేసినప్పుడు ఈ ఇందులో మహిళల మొబైల్ నెంబర్ అసలు మొబైల్ నంబర్ కు అనుసంధానించబడిన ఒక తాత్కాలిక 10 అంకెల నెంబర్ అందిస్తుంది. ఇది రియల్ నెంబర్ కాదు కాబట్టి ఏరైనా మహిళల మొబైల్ నెంబర్ తెలుసుకుని ఫోన్ చేయడానికి అవకాశం ఉండదు.
ఇప్పటి వరకు కేవలం మహిళల రక్షణ కోసం మాత్రమే సహాయం గా ఉన్న ఈ సర్వీస్ ను బిఎస్ఎన్ఎల్ కవచ్ ప్రొటెక్షన్ 2.0 తో అప్గ్రేడ్ చేసింది. ఈ సర్వీస్ తో ఇప్పుడు రెండు అదనపు బెనిఫిట్స్ తో జత చేసింది. అదేమిటంటే, ఈ సర్వీస్ తో అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 1 లక్ష వ్యక్తిగత ప్రమాద బీమా (Personal Accident Cover) ని అందిస్తుంది. ప్రమాదాల వల్ల కలిగే నష్టాలకు ఈ పాలసీ నిబంధనల ప్రకారం రక్షణ కల్పిస్తుంది.
ఇదేకాదు, ఈ సర్వీస్ తో వచ్చే ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి రూ. 10,000 వరకు సైబర్ బీమా (Cyber Insurance Cover) కూడా లభిస్తుంది. ఇది అర్హత కలిగిన సైబర్ మోసాలు లేదా సంబంధిత నష్టాలకు నిబంధనల ప్రకారం రక్షణ కల్పిస్తుంది. ఈ అప్గ్రేడ్ ని “Recharge Bhi, Suraksha Bhi” అని బిఎస్ఎన్ఎల్ కొనియాడింది. అంటే, మొబైల్ రీఛార్జ్ తో పాటు అదనపు బీమా రక్షణ కూడా అందుతుంది అన్నమాట. ఇందులో ప్రస్తుతం STV 202 ప్లాన్ ను టీజింగ్ చేసింది.
Also Read: vivo S2 FE 5G సేల్ ఈరోజు నుంచి భారీ ఆఫర్స్ తో ప్రారంభమైంది .. బెస్ట్ డీల్స్ అందుకోండి.!
దీనికోసం బిఎస్ఎన్ఎల్ అధికారిక రీఛార్జ్ పోర్టల్ లో ఈ ఆఫర్ వర్తించే ప్లాన్ లను పరిశీలించండి. బీమా కవరేజ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది మరియు ఎంతకాలం ఉంటుంది అనే వివరాలు తెలుసుకోండి. సైబర్ బీమా లో ఏ రకమైన మోసాలు కవర్ అవుతాయి, క్లెయిమ్ ఎలా చేయాలి, మినహాయింపులు ఏమిటి అనే నిబంధనలు చదవండి. పూర్తి వివరాల కోసం అధికారిక వివరాల కోసం BSNL పోర్టల్ లేదా BSNL మొబైల్ కస్టమర్ కేర్ 1800-180-1503 ను సంప్రదించవచ్చు.