Amazon GIF Sale నుంచి ఈరోజు రెండు 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీలు బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి.!

HIGHLIGHTS

రెండు 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీలు బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి

Amazon GIF Sale నుంచి స్మార్ట్ టీవీలు బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి

ఈ టీవీలు గొప్ప విజువల్స్ అందించే మినీ ఎల్ఈడి ప్యానల్ కలిగి ఉంటాయి

Amazon GIF Sale నుంచి ఈరోజు రెండు 55 ఇంచ్ Mini LED స్మార్ట్ టీవీలు బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి. రెండు స్మార్ట్ టీవీలు అంటే ఏదో ఊరు పేరు లేని బ్రాండ్ నుంచి అందించిన టీవీలు అని మాత్రం అనుకోకండి. ఈ రెండు స్మార్ట్ టీవీలలో ఒకటి శాంసంగ్ అందించిన 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ కాగా రెండోది ఫిలిప్స్ రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ.

Amazon GIF Sale Mini LED Smart Tv : డీల్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు శాంసంగ్ 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మోడల్ UA55M2EHAULXL మరియు ఫిలిప్స్ 55 ఇంచ్ క్యూడి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మోడల్ 55MLED610/94 గొప్ప డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి.

Samsung 55 Mini LED

అమెజాన్ సేల్ నుంచి ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,250 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఇది మీకు కేవలం రూ. 43,240 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ ఫీచర్స్ కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ గా నిలుస్తుంది. ఈ టీవీని ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

ఇది సాంసంగ్ ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదల చేసిన 55 మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ మరియు ఇది గొప్ప విజువల్స్ అందించే మినీ ఎల్ఈడి ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది 4K UHD రిజల్యూషన్, 50Hz రిఫ్రెష్ రేట్, HDR 10+, Mini LED Processor 4K మరియు 4కె అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 30W సౌండ్ అందిస్తుంది మరియు అడాప్టివ్ సౌండ్, అబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ మరియు Q-Symphony వంటి ఫీచర్స్ తో మంచి సౌండ్ అందిస్తుంది.

Also Read: BSNL Festival offer: దసరా పండుగ ధమాకా ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వ టెలికాం.!

PHILIPS 55 QD-Mini LED

ఇది లేటెస్ట్ గా అందించిన ప్రీమియం స్మార్ట్ టీవీ మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 47% బిగ్ డిస్కౌంట్ తో రూ. 44,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,250 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల ఆల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు బ్యాంక్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ ఈ టీవీ కేవలం రూ. 41,749 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ టీవీని ఆఫర్ ధరలో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

ఈ స్మార్ట్ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4k UHD రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన QD-Mini LED ప్యానెల్ కలిగి ఉంటుంది. ఇది డాల్బీ విజయం మరియు HDR 10+ ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అలాగే, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB RAM మరియు 32GB స్టోరేజ్ కూడా ఈ టీవిలో ఉన్నాయి. ఇది డాల్బీ ఆడియో మరియు డాల్బీ అట్మోస్ సపోర్ట్ కలిగి మంచి సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :