HDR10 vs HDR10+ vs Dolby Vision Which Features Matter in a 4K TV
మీరు ఒక కొత్త 4K స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే, మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం, మీకు వచ్చే మొదటి ప్రశ్న HDR10, HDR10+ లేదా Dolby Vision, ఈ మూడు టెక్నాలజీలలో ఏది బెస్ట్? అని చెప్పాల్సిన అవసరం లేదు. 4k టీవీ కొనుగోలు సమయంలో ఈ పేర్లు స్పెసిఫికేషన్లలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. అయితే, వీటి మధ్య అసలు తేడా ఏమిటి, కేవలం డాల్బీ విజన్ ఉన్న టీవీ కొంటె సరిపోతుందా లేక HDR10+ కూడా మంచి అనుభవాన్ని అందిస్తుందా? అని మీకు డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు చాలా సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఈరోజు సవివరంగా వివరాలు అందించాను.
HDR అంటే High Dynamic Range. ఇది చిత్రం లోని ప్రకాశవంతమైన భాగాలు, చీకటి ప్రాంతాలు, రంగుల వివరాలు మరింత సహజంగా చూపించేందుకు ఉపయోగించే టెక్నాలజీ. సాధారణంగా 4K అనేది స్క్రీన్ రిజల్యూషన్ ను సూచిస్తుంది. అంటే, టీవీలో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి, అనే విషయాన్ని తెలియజేస్తుంది. HDR మాత్రం ఆ పిక్సెల్స్ లో కనిపించే బ్రైట్నెస్, రంగులు, కాంట్రాస్ట్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఈ రెండింటి కలయిక ఉన్న టీవీలు మీకు చాలా గొప్ప చిత్రాలను అందిస్తాయి.
అయితే, 4K అని రాసి ఉన్న ప్రతి టీవీ అద్భుతమైన HDR అనుభవాన్ని అందించదు. HDR ఫార్మాట్ కు సపోర్ట్ ఉండటంతో పాటు, టీవీకి తగిన బ్రైట్నెస్, మంచి కాంట్రాస్ట్ మరియు నాణ్యమైన ప్యానెల్ కూడా అవసరం అని మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
HDR10 అనేది ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగించే HDR ఫార్మాట్ లలో ఒకటి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అనేక 4K టీవీలు, స్ట్రీమింగ్ పరికరాలు, బ్లూ-రే ప్లేయర్ మరియు గేమింగ్ కన్సోల్స్ కూడా దీని సపోర్ట్ కలిగి ఉంటాయి. ఇందులో 10-bit కలర్ డెప్త్ ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా ప్రతి ప్రైమరీ కలర్ ఛానల్ కు 1,024 స్థాయులను సూచిస్తుంది. దీనివల్ల అనుకూలమైన కంటెంట్ లో రంగుల మధ్య మార్పులు మరింత సున్నితంగా కనిపించే అవకాశం ఉంటుంది.
ఇందులో స్టాటిక్ మెటా ఉపయోగిస్తారు. అంటే, సినిమా లేదా వీడియో మొత్తానికి సంబంధించిన బ్రైట్నెస్, టోన్ మ్యాపింగ్ సూచనలు ఒక స్థిరమైన మెటాడేటా సెట్ లో ఉంటాయి. టీవీ వాటిని ఆధారంగా చేసుకుని చిత్రాన్ని తన డిస్ప్లే సామర్థ్యాలకు అనుగుణంగా చూపిస్తుంది. ఈ ఫీచర్ ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
HDR10+ అనేది HDR10 ఆధారంగా అభివృద్ధి చేసిన ఫార్మాట్. డైనమిక్ మెటా డేటా దీని ప్రధాన ప్రత్యేకత. అంటే, సీన్ ను బట్టి లేదా అనుకూలతను లేదా ఫ్రేమ్ లను బట్టి పిక్చర్ బ్రైట్నెస్, టోన్ మ్యాపింగ్ ను సర్దుబాటు చేయడానికి సూచనలు అందించగలగడం దీని ప్రత్యేకత. ఈ ఫీచర్ ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
డాల్బీ విజన్ అనేది Dolby అభివృద్ధి చేసిన అధునాతన HDR ఫార్మాట్. ఇది కూడా డైనమిక్ మెటాడేటా ను ఉపయోగిస్తుంది. అనుకూలమైన కంటెంట్ మరియు టీవీ ఉన్నప్పుడు చిత్రంలోని ప్రతి సన్నివేశానికి తగిన విధంగా టోన్ మ్యాపింగ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. డాల్బీ విజన్ సాధారణంగా 12-bit కలర్ పైప్ లైన్ కు మద్దతు ఇచ్చే ఫార్మాట్ గా రూపొందించబడింది. అయితే, ప్రస్తుతం వినియోగదారుల టీవీల్లో చాలా వరకు 10-bit ప్యానెల్స్ మాత్రమే ఉంటాయి. అంటే, డాల్బీ విజన్ సపోర్ట్ ఉందంటే ఆ టీవీ తప్పనిసరిగా నిజమైన 12-bit ప్యానెల్ కలిగి ఉందని అర్థం కాదు. ఈ ఫీచర్ ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
సాంకేతికంగా చూస్తే, HDR10+ మరియు Dolby Vision రెండూ డైనమిక్ మెటా డేటాను ఉపయోగించడం వల్ల HDR10 తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను అందించగలవు. కానీ HDR ఫార్మాట్ ఒక్కటే తుది చిత్ర నాణ్యతను నిర్ణయించలేదు.
Also Read: లేటెస్ట్ Latest Tablets అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి.!
దీనికి సరైన సమాధానం, మీ బడ్జెట్ మరియు మీ వినియోగాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవచ్చని చెబుతాను.