కేవలం 10 వేల బడ్జెట్ లోనే 3.1.2 Dolby ATMOS సౌండ్ బార్ ఆఫర్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేసి సెల్ ముగిసిన తర్వాత బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ని తీసుకొచ్చింది

త్త సౌండ్ బార్ కొనాలని చూసే వారికి ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి

కేవలం 10 వేల బడ్జెట్ లోనే 3.1.2 Dolby ATMOS సౌండ్ బార్ అందుకోవచ్చు

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేసి సెల్ ముగిసిన తర్వాత బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ని యూజర్ల కోసం ప్రకటించింది. కొత్త సౌండ్ బార్ కొనాలని చూసే వారికి ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ముఖ్యంగా డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగిన సౌండ్ బార్ లను ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్ ధరలో సేల్ చేస్తుంది. ఎంత చవక ధరలో అంటే కేవలం 10 వేల బడ్జెట్ లోనే 3.1.2 Dolby ATMOS సౌండ్ బార్ అందుకోవచ్చు.

3.1.2 Dolby ATMOS సౌండ్ బార్ ఆఫర్

3.1.2 సెటప్ తో boAt అందించిన Aavante Bar 4100DA మోడల్ సౌండ్ బార్ ఈరోజు బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 14,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 3,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

ఈ సేల్ నుంచి అందించిన డిస్కౌంట్ కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,200 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,799 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Also Read: Flipkart కొత్త సేల్ నుంచి కేవలం 6 వేలకే 525W 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్ చేస్తోంది.!

3.1.2 Dolby ATMOS సౌండ్ బార్ ఫీచర్స్

ఈ బోట్ సౌండ్ బార్ ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. అంటే, ఇది 3.1.2 సెటప్ కలిగి ఉంటుంది మరియు ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ 300W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది మంచి ఆకట్టుకునే డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ 3.1.2 సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ అవుట్ పుట్ తో డీసెంట్ సౌండ్ అందిస్తుంది. ఇది మీ OTT మూవీ అనుభవం మరియు మ్యూజిక్ అనుభూతిని మరింత గొప్పగా చేస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, USB, ఆప్టికల్ మరియు HDMI Arc మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :