OnePlus Nord CE6 Lite: భారీ ఆఫర్స్ తో మొదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.!
వన్ ప్లస్ నార్డ్ CE 6 లైట్ గత వారం ఇండియాలో లాంచ్ అయ్యింది
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది
ఈ మొదటి సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా వన్ ప్లస్ అందించింది
OnePlus Nord CE6 Lite: వన్ ప్లస్ నార్డ్ CE 5 లైట్ వారం ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ఈరోజు మొదటి సారి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ మొదటి సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా వన్ ప్లస్ అందించింది. ఈ లేటెస్ట్ ఫోన్ ప్రైస్, ఫస్ట్ సేల్ డీల్స్ మరియు ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ వివరంగా చూద్దాం.
SurveyOnePlus Nord CE6 Lite: ప్రైస్ అండ్ ఆఫర్స్
వన్ ప్లస్ నార్డ్ CE 6 లైట్ స్మార్ట్ ఫోన్ బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 20,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 22,999 ధరతో మరియు హై ఎండ్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 25,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ లభిస్తుంది.

ఇక ఈ ఫోన్ పై అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ కేవలం రూ. 18,999 ధరతో, మిడ్ వేరియంట్ రూ. 20,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ రూ. 23,999 రూపాయల ధరకే లభిస్తుంది.
Also Read: Google Down: సడన్ గా డౌన్ అయిన గూగుల్.. భారీగా రిపోర్ట్ చేసిన యూజర్లు.!
OnePlus Nord CE6 Lite: ఫీచర్స్
వన్ ప్లస్ నార్డ్ CE లైట్ 10 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 7400 Apex చిప్ సెట్ తో పని చేస్తుంది. దానికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది మంచి పెర్ఫార్మెన్స్ అందించే చిప్ సెట్ గా చెప్పబడుతుంది. ఈ ఫోన్ 6.72 LCD డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 144Hz వరకు రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రత్యేకమైన వన్ ప్లస్ కెమెరా ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
బ్యాటరీ విషయానికి వస్తే, వన్ ప్లస్ నార్డ్ CE లైట్ 7000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో, 45W SUPER VOOC ఛార్జ్ సపోర్ట్, 10W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ 300% వాల్యూమ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile