2026 new ai tech and features explained in telugu
New AI Tech: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఒకటి మరియు ప్రధానమైనది. గతంలో కంప్యూటర్లు మనం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మాత్రమే పని చేసేవి. కానీ ఇప్పుడు AI సహాయంతో మన ప్రశ్నలకు సమాధానాలు పొందడం, ఫోటోలు రూపొందించడం, వీడియోలు తయారు చేయడం మరియు వాయిస్ తో పనులు చేయించడం వంటి పనులతో పాటు ప్రోగ్రామింగ్ కోడ్ రాయడం వంటి క్లిష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేయడం వీలుపడుతుంది. 2026 నాటికి AI టెక్నాలజీ కేవలం చాట్ బాట్ లకు మాత్రమే పరిమితం కాకుండా, పర్సనల్ అసిస్టెంట్, కార్యాలయ ఆటోమేషన్, విద్య, వైద్యం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో విస్తరిస్తోంది. అందుకే, మన జీవితాలను మార్చే అద్భుతమైన ఫీచర్లు మరియు ఉపయోగాలు తెలుసుకోవడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించే వాటిలో కొన్ని ఫీచర్స్ చాలా ముఖ్యమైనవిగా చెబుతారు. వీటిలో, AI ఏజెంట్లు, మల్టీ మోడల్ AI, AI వీడియో జనరేషన్, రియల్ టైం ట్రాన్స్ లేషన్ మరియు AI కోడింగ్ అసిస్టెంట్లు వంటి ఫీచర్స్ ముఖ్ ముఖ్యమైనవి.
మనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడమే AI పని అని మనం అనుకుంటాం. కానీ AI ఏజెంట్లు ఒక లక్ష్యాన్ని సాధించడానికి పలు దశల్లో పని చేయగలవు. ఉదాహరణకు, సమాచారాన్ని సేకరించడం, వివరాలు పోల్చడం, నివేదిక తయారు చేయడం వంటి పనులు యూజర్ పర్యవేక్షణ తో నిర్వహించవచ్చు. అయితే, ప్రతి పనిని పూర్తిగా ఆటోమేటిగ్గా చేయగలవని భావించకూడదు.
కొత్త తరం AI టూల్స్ ద్వారా టెక్స్ట్ లేదా చిత్రాల ఆధారంగా వీడియోలను రూపొందించవచ్చు. యూట్యూబ్ వీడియోలు, ప్రకటనలు, ఎడ్యుకేషన్ కంటెంట్, సోషల్ మీడియా రీల్స్ తయారీలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. కొన్ని టూల్స్ లో కెమెరా కదలికలు, బ్యాగ్రౌండ్ నోయిస్, పాత్రల కదలికలను కూడా నియంత్రించే సదుపాయాలు ఉంటాయి.
సాఫ్ట్ వేర్ అభివృద్ధిలో AI ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. వెబ్ సైట్లు తయారు చేయడం, కోడ్ లో ఉన్న లోపాలను గుర్తించడం, ప్రోగ్రామ్ లను పరీక్షించడం మరియు డాక్యుమెంటేషన్ రాయడం వంటి పనుల్లో ఇది డెవలపర్లకు సహాయం చేస్తుంది. అయితే, AI రూపొందించిన కోడ్ ను పరీక్షించడం మరియు ఆ కోడ్ ను భద్రతాపరంగా పరిశీలించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.
ఈ టెక్నాలజీ సాధారణ టెక్స్ట్‌తో పాటు ఇమేజ్, ఆడియో, వీడియో వంటి వివిధ రకాల సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక ఫోటో చూపించి దాని గురించి ప్రశ్నించడం లేదా వాయిస్ ద్వారా మాట్లాడి సమాధానం పొందడం చాలా ఈజీగా చేయవచ్చు.
AI ఆధారిత వాయిస్ టూల్స్ సహజమైన సంభాషణలు, స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్, భాషల మధ్య అనువాదానికి ఉపయోగపడతాయి. తెలుగు మాట్లాడేవారికి ఇతర భాషల్లోని సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో ఇవి సహాయపడవచ్చు. అలాగే, మనం మాట్లాడే భాషను ఇతరులకు అర్థం అయ్యేలా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
Also Read: రేపు రిలీజ్ కాబోతున్న Oppo Find X10 అండ్ X10 Pro Max కెమెరా గురించి తెలిస్తే మతిపోతుంది.!
అందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, AI ఇచ్చే ప్రతి సమాధానం నిజమని నమ్మకూడదు. కొన్నిసార్లు ఏఐ తప్పు సమాచారం, నకిలీ ఫోటోలు, డీప్ ఫేక్ వీడియోలు రూపొందించవచ్చు. కాబట్టి, వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, పాస్ వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని తెలియని AI సర్వీస్ లలో నమోదు చేయకూడదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు విశ్వసనీయమైన సోర్స్ ద్వారా సమాచారం సరైనదే అని ధృవీకరించాలి.
ఏఐ కొత్త ఫీచర్స్ ఉపయోగాల గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఏఐ టెక్నాలజీని సరిగ్గా నేర్చుకుని, బాధ్యతాయుతంగా ఉపయోగించ కలిగితే విద్య, ఉద్యోగం, వ్యాపారం, సృజనాత్మక రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఏఐ మనిషిని పూర్తిగా భర్తీ చేసే సాధనం అనడం కంటే, మనిషి సామర్థ్యాన్ని పెంచే సహాయక టెక్నాలజీ గా ఉపయోగపడటం దీని ప్రధాన లక్ష్యం కావాలి.