అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బిగ్ 4K స్మార్ట్ టీవీ డీల్ ను ప్రకటించింది. ఈరోజు అమెజాన్ సేల్ మొదటి రోజు కావడంతో స్మార్ట్ టీవీల పైన బంపర్ ఆఫర్లను అందించింది. ఈ బిగ్ సేల్ నుండి ఇఫాల్కన్ యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ 62% భారీ డిస్కౌంట్ తో కేవలం 18 వేల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ బిగ్ సైజుతో పాటుగా HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. మరి అమెజాన్ సేల్ నుండి ప్రకటించిన ఈ 4K UHD టీవీ అఫర్ ఏమిటో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
iFFALCON యొక్క 43 ఇంచ్ 4K Ultra HD సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మోడల్ 43U61 టీవీ ఈరోజు అమెజాన్ GIF సేల్ నుండి 62% డిస్కౌంట్ తో కేవలం రూ.17,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన SBI 10% బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ఈఇఫాల్కన్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో HDR 10 సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 1USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ తో వస్తుంది.