Vi Super Plans: సింపుల్ రీఛార్జ్ తో ఫోన్ పై రూ. 25,000 ఇన్సూరెన్స్ కవరేజీ అందుకోండి.!
వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు ఇప్పుడు గొప్ప శుభవార్త అందించింది
చరిత్రలో మైలురాయిగా మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను పరిచయం చేసింది
యూజర్ల కోసం ఇన్సూరెన్స్ కవరేజీ తో కూడిన మూడు డేటా వోచర్ ప్లాన్స్ అందించింది
Vi Super Plans: వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు ఇప్పుడు గొప్ప శుభవార్త అందించింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ చరిత్రలో మైలురాయిగా మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను పరిచయం చేసింది. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా డేటా, వ్యాలిడిటీ మరియు ఫోన్ పై రూ. 25,000 ఇన్సూరెన్స్ కవరేజీ వంటి మూడు లాభాలు అందిస్తాయి.
SurveyVi Super Plans: ఏమిటి ఈ ప్లాన్స్?
వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్ల కోసం ఇన్సూరెన్స్ కవరేజీ తో కూడిన మూడు డేటా వోచర్ ప్లాన్స్ అందించింది. అవేమిటంటే, రూ. 61 డేటా ప్లాన్, రూ. 201 డేటా ప్లాన్ మరియు రూ. 251 డేటా ప్లాన్ మూడు ఉన్నాయి. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అందించే డేటా, వ్యాలిడిటీ మరియు ఫోన్ ఇన్సూరెన్స్ కవరేజీ వంటి మూడు బెనిఫిట్స్ ఆఫర్ చేస్తాయి.
Vi రూ. 61 డేటా ప్లాన్
ఈ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 2 జీబీ 4జి హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ డేటా ప్లాన్ 15 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అయితే, ఇది సర్వీస్ వారంటీ కాదు సుమా, కేవలం యద ఆన్ మాత్రమే అని గుర్తుంచుకోండి. అయితే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు రూ. 25,000 రూపాయల ఇన్సూరెన్స్ కవరేజీ అందిస్తుంది. ఇది 30 డేస్ లిమిటెడ్ టైం కవరేజి మాత్రమే అందిస్తుంది. అయినా కూడా కేవలం డేటా మాత్రమే కాకుండా మీ ఫోన్ పై గొప్ప ఇన్సూరెన్స్ కవరేజీ పొందవచ్చు. ఇది ఫోన్ చోరీ జరిగినా లేదా పోగొట్టుకోవడం వంటి పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తుంది.

Vi రూ. 201 డేటా ప్లాన్
ఇది కూడా పెయిన్ తెలిపిన రూ. 61 ప్లాన్ మాదిరిగా డేటా ప్లాన్ మరియు 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ కూడా మీకు ఎటువంటి సర్వీస్ వ్యాలిడిటీ అందించదు. ఈ ప్లాన్ తో 10GB డేటా 30 డేస్ వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 6 నెలల రూ. 2,5000 రూపాయల ఫోన్ ఇన్సూరెన్స్ కవరేజీ అందుకుంటారు. ఈ ప్లాన్ తో ఎక్కువ రోజులు ఇన్సూరెన్స్ కవరేజీ పొందవచ్చు.
Also Read: iPhone 16 Deal: ఫ్లిప్ కార్ట్ నుంచి ఐఫోన్ 16 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!
Vi రూ. 201 డేటా ప్లాన్
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పైన తెలిపిన రూ. 201 ప్లాన్ మాదిరిగా 30 రోజులు 10GB డేటా తో వస్తుంది. అయితే, ఈ ప్లాన్ పూర్తిగా 365 రోజులు రూ. 2,5000 రూపాయల ఫోన్ ఇన్సూరెన్స్ కవరేజీ అందిస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు పూర్తిగా ఓకే సంవత్సరం మొత్తం రూ. 2,5000 రూపాయల ఫోన్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందవచ్చు.
గమనిక : ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 48 గంటల్లో Vi అందించే ఇన్సూరెన్స్ SMS కి స్పందించి ఫోన్ వివరాలతో ఇన్సూరెన్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ ఇన్సూరెన్స్ కేవలం ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయిన సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఫోన్ పగిలిన లేదా పాడైనా ఈ ఇన్సూరెన్స్ వర్తించదు.