iPhone 16 Deal: ఫ్లిప్ కార్ట్ నుంచి ఐఫోన్ 16 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

ఐఫోన్ 16 ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది

ఐఫోన్ 16 కొనాలని ఆలోచిస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు

ఈ ఫోన్ లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఈరోజు చాలా తక్కువ ధరలో లభిస్తుంది

iPhone 16 Deal: ఫ్లిప్ కార్ట్ నుంచి ఐఫోన్ 16 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

iPhone 16 Deal: ఆపిల్ గత జనరేషన్ ఫోన్ ఐఫోన్ 16 ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఐఫోన్ 16 కొనాలని ఆలోచిస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు. ఈ ఫోన్ లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఈరోజు చాలా తక్కువ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iPhone 16 Deal: ఏమిటి ఈ డీల్?

ఐఫోన్ 16 ఫోన్ ఇండియాలో రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 17,000 భారీ డిస్కౌంట్ తో రూ. 62,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్ తో ఐఫోన్ 16 ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 61,499 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ లో మీకు లభిస్తుంది. ఈ ఫోన్ ను HDFC క్రెడిట్ కార్డు తో కొనే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఒక రెండో ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి Flipkart SBI క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి 5% డిస్కౌంట్, అంటే రూ. 3,149 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఐఫోన్ 59,850 రూపాయల ఆఫర్ ధరలోనే మీకు లభిస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఐఫోన్ 15 ధర అవుతుంది.

Also Read: End Of Season Sale: కేవలం 5 వేల బడ్జెట్ లో జబర్దస్త్ సౌండ్ బార్ అందుకోండి.!

iPhone 16 Deal: ఫీచర్స్

ఐఫోన్ 16 ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది డైనమిక్ ఐల్యాండ్ మరియు HDR సపోర్ట్ తో వైబ్రాంట్ కలర్ అందిస్తుంది. అంతేకాదు, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో సన్ లైట్ లో కూడా గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ యాపిల్ యొక్క A18 Bionic చి తో పని చేస్తుంది మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది మరియు కొత్త అప్డేట్ తో త్వరగా అప్డేట్ అందుకుంటుంది.

ఇక ఐఫోన్ అసలు ప్రత్యేకత కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 48 MP మెయిన్ కెమెరా జతగా 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 12MP డెప్త్ కెమెరా ఉంటాయి. ఇది 60FPS వద్ద Dolby Vision HDR 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు టన్నుల కొద్ది ఆపిల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సింగిల్ డే బ్యాకప్ అందించే బ్యాటరీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo