ASC Arjun: చిటికెలో దొంగలను పట్టుకున్న వైజాగ్ హ్యూమనాయిడ్ రోబో పోలీస్.!

HIGHLIGHTS

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ భద్రతలో భాగంగా రైల్వే శాఖ మరింత అధునాతన విధానాలు అమలు పరుస్తోంది

ASC Arjun అధునాతన హ్యూమనాయిడ్ రోబోట్ ఇప్పుడు సంచలనం సృష్టించింది

ఏఎస్‌సీ అర్జున్ ద్వారా నేరస్థులని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు

ASC Arjun: చిటికెలో దొంగలను పట్టుకున్న వైజాగ్ హ్యూమనాయిడ్ రోబో పోలీస్.!

ASC Arjun: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ భద్రతలో భాగంగా రైల్వే శాఖ మరింత అధునాతన విధానాలు అమలు పరుస్తోంది. ఇందులో భాగంగా ఒక శక్తివంతమైన కొత్త సెటప్ ను రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసింది. అదే, హ్యూమనాయిడ్ రోబో ఏఎస్‌సీ అర్జున్ మరియు ఈ అధునాతన హ్యూమనాయిడ్ రోబోట్ ఇప్పుడు సంచలనం సృష్టించింది. భారత రైల్వే సంస్థ కొత్తగా AI ఆధారిత హ్యూమనాయిడ్ రోబో ‘ఏఎస్‌సీ అర్జున్’ ద్వారా ఇద్దరు పాత నేరస్థులని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కొత్త చర్య ద్వారా నేరాల నివారణకు నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఇప్పుడు రైలు ప్రయాణికుల రక్షణలో టెక్నాలాజి కీలక పాత్ర వహించే స్థాయికి చేరుకున్నట్లు స్పష్టంగా తెలియచేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ASC Arjun: రోబో పోలీస్

విశాఖపట్నం స్టేషన్ స్టేషన్ ఎంట్రన్స్ లో 2 ఫిబ్రవరి 2026 రాత్రి ఏఎస్‌సీ అర్జున్ విధులు నిర్వహిస్తుండగా, సుమారు 8:10 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ హ్యుమనాయిడ్ రోబో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి పై దృష్టి పెట్టింది. ఈ రోబో కలిగిన అత్యాధునిక AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ లో ముందే లోడ్ చేయబడిన నేరస్తుల డేటాబేస్‌లో ఉన్న ఒక వ్యక్తి ముఖాన్ని మ్యాచ్ అయినట్లు గుర్తించింది. అంతే, వెంటనే ఈ రోబో RPF (Railway Protection Force) CCTV కంట్రోల్ రూమ్‌కు ఈ విషయం గురించి అలర్ట్ జారీ చేసింది.

ASC Arjun Robo Police

ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే పోలీసు శాఖకు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ బి.ఎస్. నారాయణ మరియు SI కీర్తి రెడ్డి మరియు క్రైమ్ ప్రివెన్షన్ డిటెన్షన్ స్క్వాడ్ (CPDS) తో కలిసి తనిఖీలు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐడి నిజంగా హర్షనీయాంశమైన చర్య. ఎందుకంటే, ఎవరికి అనుమానం రాకుండా మరియు చాలా వేగంగా దొంగలను పట్టుకోవడం చాలా గొప్ప విషయం. ఇందులో వేగవంతం మరియు ఖచ్చితమైన వ్యక్తిని గుర్తించడం అతి ముఖ్యమైన విషయం అవుతుంది.

Also Read: Samsung Galaxy F70e 5G: న్యూ లుక్ అండ్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!

ఏఐ రోబో ప్రత్యేకతలు ఏమిటి?

ఇది AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ ప్రత్యేకతతో చాలా వేగంగా మరియు రియల్ టైంలో ముఖాలను డేటా బేస్‌ తో అనలైజ్ చేసి అనుమానితులను వేగంగా గుర్తిస్తుంది. ఇది 24×7 పెట్రోలింగ్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ముఖ్యంగా, రద్దీగా ప్రయాణికులతో నిండిన ప్రాంతాల్లో కూడా చక్కగా సంచరిస్తూ సమర్థవంతంగా పని చేసే సత్తాని ఈ రోబో కలిగి ఉంటుంది.

ఈ సరికొత్త AI ఆధారిత రోబో టెక్నాలజీ రైల్వే స్టేషన్ భద్రతను మరింత బలపరిచే శక్తి కలిగి ఉంటాయని ఈ సంఘటన ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒక పైలట్ ప్రోజెక్ట్ గా ప్రారంభమైనప్పటికీ, ఇది చాలా సాఫీగా పనిచేస్తూ ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చే మార్గంలో గొప్ప కార్యసాధకులు అయ్యే అవకాశం ఉందని అనిపించేలా చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo