Redmi Note 17 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రిలీజ్ .. భారీ బ్యాటరీ తో వస్తుంది.!

HIGHLIGHTS

Redmi Note 17 5G కోసం టీజింగ్ చేస్తూ వచ్చిన షియోమీ

ఈ రోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది

రెడ్ మీ నోట్ 17 5జి స్మార్ట్ ఫోన్ భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది

Redmi Note 17 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రిలీజ్ .. భారీ బ్యాటరీ తో వస్తుంది.!

గత నాలుగైదు రోజులుగా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Redmi Note 17 5G కోసం టీజింగ్ చేస్తూ వచ్చిన షియోమీ, ఈ రోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ mAh మాస్టర్ గా లాంచ్ అవుతుందట. అంటే, ఈ ఫోన్ బ్యాటరీ గురించి ఈ షియోమీ ఈ విధంగా చెబుతోంది. ఈ షియోమీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ వివరాలు చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 17 5G : రిలీజ్ డేట్

రెడ్ మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ ని ఆగస్టు 6వ తేదీన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా అందించిన టీజర్ లో ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రిలీజ్ చేసింది.

Redmi Note 17 5G : ఫీచర్స్

రెడ్ మీ నోట్ 17 5జి స్మార్ట్ ఫోన్ భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ బ్యాటరీ డీటెయిల్స్ ను కంపెనీ అఫీషియల్ గా రివీల్ చేసింది. అంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ప్రత్యేకమైన 5జి ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ డిజైన్ ను కూడా కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీ కారణంగా ఈ ఫోన్ కొంచెం మందంగా ఉంటుంది.

Redmi Note 17 5G

ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా మోడ్యూల్ ఉంది మరియు ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో ఉన్న సెన్సార్ వివరాలు ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే, ఇందులో 50MP ప్రధాన కెమెరా వుండే అవకాశం ఉంటుందని కొన్ని లీక్స్ చెబుతున్నాయి.

Also Read : OnePlus N6x: లాంచ్ కంటే ముందే సేల్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!

రెడ్ మీ నోట్ 17 : అంచనా ఫీచర్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో 6.8 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉండవచ్చు. కొన్ని లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 4 Gen 4 చిప్‌ సెట్ తో లాంచ్ కావొచ్చని కూడా తెలుస్తోంది. ఇదే కాదు ఇందులో 12GB వరకు ర్యామ్ ఫీచర్ మరియు 256GB వరకు భారీ స్టోరేజ్ కూడా ఉండే అవకాశం ఉండొచ్చని అంచనా.

ఈ ఫోన్ గురించి వచ్చిన లీక్స్ చూస్తుంటే, ఈ ఫోన్ బడ్జెట్ యూజర్ కోసం షియోమీ తీసుకొస్తున్న బిగ్ బ్యాటరీ బడ్జెట్ ఫోన్ అయ్యే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇవన్నీ కూడా లీక్స్ అండ్ అంచనా ఫీచర్స్ మాత్రమే. ఈ ఫోన్ అఫీషియల్ ఫీచర్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఫోన్ ఫీచర్స్ లో ఎన్ని నిజం అవుతాయో తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile