ఉచిత డేటా!! ఆఫర్ చేస్తున్న జియో ప్లాన్స్ ఇవే

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 22 Jun 2021 10:14 IST
HIGHLIGHTS
  • ఉచిత డేటా అఫర్ చేస్తున్న జియో ప్లాన్స్

  • లాంగ్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్

  • Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితం

ఉచిత డేటా!! ఆఫర్ చేస్తున్న జియో ప్లాన్స్ ఇవే
ఉచిత డేటా ఆఫర్ చేస్తున్న జియో ప్లాన్స్ ఇవే

ఉచిత డేటా అఫర్ చేస్తున్న జియో ప్లాన్స్ మీకు తెలుసా? జియో కస్టమర్ల కోసం రోజువారి ఎక్కువ డేటా లిమిట్ తో పాటుగా గరిష్టంగా 10GB వరకూ ఉచిత డేటా అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ ని కూడా అందించింది. ఈ ప్లాన్స్ లాంగ్ వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా మరిన్ని ప్రయోజాలను కూడా అందిస్తాయి. అందుకే, జియో యొక్క ఈ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దాం.

1. రిలయన్స్ జియో రూ .401 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ కొంచెం ఎక్కువ ధరతో వున్నా కూడా అధిక డేటా ప్రయోజనంతో వస్తుంది. రోజు ఎక్కువ డేటాని కోరుకునే వారికీ ఇది సరిగ్గా సరిపోతుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 28 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలవిషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు డైలీ 3GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 90GB డేటాతో పాటుగా 6GB ఉచిత డేటాని కూడా అందిస్తుంది. అంతేకాదు, రూ.399 రూపాయల విలువ గల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది. అలాగే,Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

2. రిలయన్స్ జియో రూ.777 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ బడ్జెట్‌ లో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 84 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ ప్లానుతో మీకు డైలీ 1.5 GB హై స్పీడ్ 4G డేటాతో మరియు 5GB అధనపు ఉచిత డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తంగా 131 GB డేటాని మరియు రూ. 399 రూపాయల విలువ గల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది. అలాగే,Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

3. రిలయన్స్ జియో రూ .2,599 ప్లాన్

రిలయన్స్ జియో యొక్క ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. జియో యొక్క ఈ ప్లానుతో అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMS,  మరియు 365 రోజుల వ్యాలిడిటీని కలిగివుంది. ఈ ప్లానుతో మీకు డైలీ 2 GB హై స్పీడ్ 4G డేటాతో పూర్తి వ్యాలిడిటీతో పాటుగా, అధనపు 10GB ఉచిత హై స్పీడ్ డేటాని అఫర్ చేస్తుంది. అంటే, పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 740 GB డేటాని మరియు Jio Apps కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. అధనంగా, 399 రుపాయల విలువగల Disney+ Hotstar 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది.   

మరిన్ని టెక్నాలజీ న్యూస్, ప్రోడక్ట్ రివ్యూస్, సైన్స్-టెక్ ఫీచర్లు మరియు అప్డేట్స్ కోసం Digit.in లేదా మా గూగుల్ న్యూస్ పేజ్ ను సందర్శించండి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

jio best plans which offers extra data

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు