అమెజాన్ ఇండియా ఈరోజు Great Republic Day Sale ను అనౌన్స్ చేసింది. భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ అప్ కమింగ్ సేల్ ను తీసుకొచ్చినట్లు అమెజాన్ టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్ తో పాటు ఈ అప్ కమింగ్ సేల్ బిగ్ డీల్స్ మరియు ఆఫర్స్ తెలియచేస్తూ ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీని కూడా ఈ రోజు విడుదల చేసింది. ఈ పేజీ నుండి అప్ కమింగ్ డీల్స్ అండ్ ఆఫర్స్ కూడా అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Great Republic Day Sale : ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
2026 జనవరి 16వ తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ బిగ్ సేల్ కోసం అమెజాన్ ఇండియా తో SBI సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ సేల్ నుండి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు తో వస్తువులు కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఇక సేల్ నుంచి అమెజాన్ ఆఫర్ చేయనున్న డీల్స్ విషయానికి వస్తే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి బ్లాక్ బస్టర్ డీల్స్, బెస్ట్ ఎక్స్ చేంజ్, టాప్ 100 డీల్స్, 8pm డీల్స్ మరియు ట్రేండింగ్ డీల్స్ వంటి మరిన్ని క్రేజీ డీల్స్ అందిస్తుంది.
Great Republic Day Sale : స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ ఏమిటి?
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి చాలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ నుంచి ఐఫోన్, శాంసంగ్, ఐకూ, రియల్ మీ, వన్ ప్లస్, షియోమీ, వివో మరియు ఒప్పో నుంచి వచ్చిన లేటెస్ట్ ఫోన్స్ గొప్ప డీల్స్ అందుకోవచ్చని అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది.
అంతేకాదు, అమెజాన్ సేల్ టీజర్ పేజీ నుంచి ప్రతి బడ్జెట్ సెగ్మెంట్ నుంచి అందించే స్మార్ట్ ఫోన్ డీల్స్ ఇప్పటి నుంచే టీజింగ్ చేస్తోంది. వాటిలో యాపిల్ ఐఫోన్ 17 ప్రో, వన్ ప్లస్ 15, శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా, వన్ ప్లస్ నార్డ్ 5, రియల్ మీ నార్జో 80 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ప్రో, వివో ఎక్స్ 300 మరియు మరిన్ని ఫోన్లు లిస్ట్ చేసింది.
ఇది మాత్రమే కాదు ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ మరియు మొబైల్ యాక్సెసరీస్ డీల్స్ కూడా లిస్ట్ చేసింది. అయితే, ఈ సేల్ యొక్క అతిపెద్ద ఆఫర్ గా వన్ ప్లస్ బడ్స్ 4 ను ప్రకటించింది. అంటే, ఈ వన్ ప్లస్ ప్రీమియం బడ్స్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తుందని చెబుతోంది.
అమెజాన్ అప్ కమింగ్ బిగ్ సేల్ డీల్స్ మరియు ఆఫర్స్ కొత్త అప్డేట్ తో మళ్ళి కలుద్దాం.