Tecno Spark Go 3: బడ్జెట్ ధరలో మరో దమ్ దార్ ఫోన్ లాంచ్ చేస్తున్న టెక్నో.!

HIGHLIGHTS

టెక్నో స్పార్క్ గో అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా ఈరోజు రివీల్ చేసింది

Tecno Spark Go 3 ధరకు తగిన ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుందని అంచనా

ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీతో టీజింగ్ చేస్తోంది

Tecno Spark Go 3: బడ్జెట్ ధరలో మరో దమ్ దార్ ఫోన్ లాంచ్ చేస్తున్న టెక్నో.!

Tecno Spark Go 3 : ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ టెక్నో బడ్జెట్ సిరీస్ స్పార్క్ గో అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా ఈరోజు రివీల్ చేసింది. ఈ సిరీస్ నుంచి ఇప్పటి వరకు అందించిన ఫోన్స్ ప్రైస్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ధరకు తగిన ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Spark Go 3 : లాంచ్ డేట్?

స్పార్క్ గో 3 స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు స్పార్క్ ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీతో టీజింగ్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన టీజర్ పీజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా రివీల్ చేసింది.

Tecno Spark Go 3 : కీలక ఫీచర్స్

ఈ అప్ కమింగ్ స్పార్క్ స్మార్ట్ ఫోన్ పర్పల్ కలర్ వేరియంట్ లో వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నట్లు కనిపిస్తోంది మరియు చాలా సింపుల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక సింగిల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు ఒక ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అనుకోకుండా 1.2 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా కూడా తట్టుకునే సత్తా కలిగి ఉంటుందని స్పార్క్ చెబుతోంది. ఇదే కాదు, ఈ ఫోన్ IP 64 రేటింగ్ డస్ట్ అండ్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది.

Tecno Spark Go 3

ఈ ఫోన్ ను కూడా నెట్ వర్క్ లేని సమయంలో పని చేసే ఆఫ్ లైన్ కాల్ ఫీచర్ తో అందిస్తుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ దమ్ దార్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందట. ఈ ఫోన్ 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ తో 4 సంవత్సరాల ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని టెక్నో తెలిపింది. ఈ ఫోన్ ను కూడా Ella AI సపోర్ట్ తో టెక్నో లాంచ్ చేస్తుంది.

Also Read: BSNL Super Plan: మినిమం రీఛార్జ్ తో 100GB డేటా అందించే అన్లిమిటెడ్ ప్లాన్ ఇదే.!

ఈ టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పెద్ద సౌండ్ అందించే స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను అండర్ రూ. 8,000 ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. మరి ఈ ఫోన్ ను ఎలాంటి ప్రైస్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందో చూడాలి. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo