BSNL : ఒక నెల రీఛార్జ్ ఖర్చుతోనే 50 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందుకోండి.!
బీఎస్ఎన్ఎల్ ఒక నెల రీఛార్జ్ ఖర్చుతోనే 50 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందుకోండి
ఈ ప్లాన్ తక్కువ ఖర్చులో 50 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు ఆఫర్ చేస్తుంది
వ్యాలిడిటీ సమయానికి అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ అందిస్తుంది
BSNL : పెరిగిన టెలికాం రేట్లు యూజర్‌లను ఇరకాటంలో పెడుతుంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం ఒక నెల రీఛార్జ్ ఖర్చుతోనే 50 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందుకోండి అంటోంది. అఫ్ కోర్స్, ఈ మాట నేరుగా చెప్పలేదు అనుకోండి, ఇలాంటి లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఈ సమాధానం చెప్పింది. బీఎస్ఎన్ఎల్ అందించిన లేటెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బీఎస్ఎన్ఎల్ సమాధానం అవుతుంది.
SurveyBSNL :
దేశంలో ఇప్పటికే అన్ని టెలికాం కంపెనీలు కూడా అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ని దాదాపు రూ. 350 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఆఫర్ చేస్తున్నాయి. ఇది నేను చెబుతున్న మాట కాదు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ చెబుతున్న మాట. అయితే, బీఎస్ఎన్ఎల్ మాత్రం కొత్త రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్ తో ఈ ప్లాన్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే, ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం 350 రూపాయల కంటే తక్కువ ఖర్చులో 50 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు ఆఫర్ చేస్తుంది. చవక ధరలో బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూసే యూజర్లు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను పరిశీలించవచ్చు.
Also Read: మీ ఫోన్ Battery Life రెట్టింపు చేయాలంటే ఇలా చేయండి.!
BSNL : రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్
ఇక బీఎస్ఎన్ఎల్ రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు అందించే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 50 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ 50 రోజుల వ్యాలిడిటీ సమయానికి అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 2 జీబీ హై స్పీడ్ డేట్ మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. అంటే, ఈ రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే బీఎస్ఎన్ఎల్ యూజర్లు 50 రోజుల పాటు నిశ్చింతగా ఉండొచ్చు.

ఒకవేళ తక్కువ రీఛార్జ్ ఓ ఎక్కువ లాభాలు అందించే మరిన్ని ప్లాన్ కోసం సెర్చ్ చేస్తుంటే మీరు బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న రూ. 99 మరియు రూ. 153 ప్రీపెయిడ్ రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ లను చూడవచ్చు. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తాయి. అయితే, 99 రూపాయల ప్లాన్ 15 రోజులు మరియు 153 రూపాయల ప్లాన్ 25 రోజులు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. రూ. 99 ప్లాన్ రోజుకు 500 MB డేటా అందిస్తే, రూ. 153 ప్లాన్ రోజుకు 1GB హై స్పీడ్ అందిస్తుంది. ఈ రెండు ప్లాన్స్ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తాయి. రూ. 153 ప్లాన్ డైలీ 100SMS సౌకర్యం కూడా అందిస్తుంది.