APPLE iPhone 17 పై బిగ్ డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.. భారీ డిస్కౌంట్ అందుకోండి.!
APPLE iPhone 17 పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అనౌన్స్ చేసింది
ఈ లేటెస్ట్ ఐఫోన్ అద్భుతమైన కెమెరా మరియు గొప్ప ఏఐ ఫీచర్లు కలిగి ఉంటుంది
ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ తో జతగా వస్తుంది
APPLE iPhone 17 పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. ఆపిల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ధరలో కొనాలని చూసే యూజర్లకు ఈరోజు అందించిన గొప్ప ఆఫర్లు ఉపయోగపడతాయి. ఈ లేటెస్ట్ ఐఫోన్ అద్భుతమైన కెమెరా మరియు గొప్ప ఏఐ ఫీచర్లు కలిగి ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం ఫ్లిప్ కార్ట్ ఈ ఐఫోన్ పై అందించిన ఆఫర్లు మరియు ఫోన్ యొక్క ఫీచర్స్ వెంటనే తెలుసుకుందామా.
SurveyAPPLE iPhone 17 : ఆఫర్
ఐఫోన్ 17 ఫోన్ ఇండియాలో రూ. 82,900 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఐదు ప్రైస్ ట్యాగ్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 75,900 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు .

ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ రూ. 3,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 4,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ మీకు రూ. 75,900 డిస్కౌంట్ ధరలో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది.
Also Read: Samsung Galaxy M17e 5G మంచి ఆఫర్స్ తో సేల్ అవుతోంది.!
APPLE iPhone 17 : ఫీచర్స్
ఐఫోన్ 17 ఫోన్ 6.3 ఇంచ్ సూపర్ రెటీనా XDR స్క్రీన్ ను 2622 x 1206 రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, సిరామిక్ షీల్డ్, 1 నిట్ మినిమం బ్రైట్నెస్ మరియు 120Hz గరిష్ట రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆపిల్ యొక్క లేటెస్ట్ A19 Chip తో నడుస్తుంది మరియు iOS 26 తో వస్తుంది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ తో జతగా వస్తుంది.
ఈ ఫోన్ లో 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా జతగా 48MP ఫ్యూజన్ అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 18MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision వీడియో సపోర్ట్ మరియు గొప్ప హై రిజల్యూషన్ ఫోటోలు కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ఒక రోజంతా పని చేసే బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు టైప్ C ఛార్జ్ పోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile