Samsung Galaxy M17e 5G మంచి ఆఫర్స్ తో సేల్ అవుతోంది.!
Samsung Galaxy M17e 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది
రెండు రోజుల క్రితం విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్స్ తో సేల్ అవుతోంది
ఈరోజు లిమిటెడ్ ఆఫర్ లో భాగంగా రూ. 1,000 తగ్గింపుతో కేవలం రూ. 11,999 ఆఫర్ ధరకే లభిస్తుంది
Samsung Galaxy M17e 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను కేవలం 12 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఆరు సంవత్సరాల OS అప్‌గ్రేడ్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ అందించింది. ఈ శాంసంగ్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇక్కడ చూడవచ్చు.
SurveySamsung Galaxy M17e 5G : ప్రైస్
గెలాక్సీ M17e ఫోన్ బేసిక్ 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 12,999 రూపాయల అతి తక్కువ ధరలో చేసింది. అయితే, ఈరోజు లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ లో భాగంగా రూ. 1,000 తగ్గింపుతో కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ను కూడా ఈరోజు కేవలం రూ. 13,499 ధరకే అందించడం జరిగింది.

ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వైబ్ వయోలెట్ మరియు బ్లిట్జ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు శాంసంగ్ అఫీషియల్ సైట్ నుంచి లభిస్తుంది.
Also Read: Samsung Dolby Atmos స్మార్ట్ స్పీకర్ ను కేవలం 12 వేల బడ్జెట్ ధరలో అందుకోండి.!
Samsung Galaxy M17e 5G : ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ M17e స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ One UI 8.0 సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుంది. అంతేకాదు, 6 జెనరేషన్ OS అప్ గ్రేడ్ తో పాటు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది.
ఈ ఫోన్ 6.7 ఇంచ్ LCD స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ అడాప్టివ్ బ్రైట్నెస్ ఫీచర్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 8.2mm సైజుతో కొంచెం మందంగా ఉన్నా మంచి స్టైలిష్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో 50MP మెయిన్ కెమెరా జతగా 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది AI కెమెరా ఫీచర్స్ తో అముఞ్చి ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని శాంసంగ్ తెలిపింది.
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఇందులో సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆటో బ్లాకర్, ఫేస్ అన్లాక్ మరియు Samsung Knox వంటి సెక్యూరిటీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile