Samsung Dolby Atmos స్మార్ట్ స్పీకర్ ను కేవలం 12 వేల బడ్జెట్ ధరలో అందుకోండి.!

HIGHLIGHTS

Samsung Dolby Atmos స్పీకర్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 12 వేల బడ్జెట్ ధరలోనే లభిస్తోంది

డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో అందించిన 2.0 ఛానల్ బ్లూటూత్ స్పీకర్

ఈ స్పీకర్ మామూలు స్పీకర్ కాదు ఇంటి డెకరేషన్ గా కూడా ఆకట్టుకునే ప్రత్యేకమైన స్పీకర్

Samsung Dolby Atmos స్మార్ట్ స్పీకర్ ను కేవలం 12 వేల బడ్జెట్ ధరలో అందుకోండి.!

Samsung Dolby Atmos స్పీకర్ ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ శాంసంగ్ 2024 చివరిలో డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో అందించిన 2.0 ఛానల్ బ్లూటూత్ స్పీకర్ ఈరోజు మునుపెన్నడు చూడనంత చవక ధరలో లభిస్తుంది. ఈ స్పీకర్ మామూలు స్పీకర్ కాదు ఇంటి డెకరేషన్ గా కూడా ఆకట్టుకునే ప్రత్యేకమైన స్పీకర్. ఈ ప్రీమియం స్పీకర్ పై ఈరోజు లభిస్తున్న ఆఫర్లు మరియు ఈ స్పీకర్ ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Dolby Atmos స్పీకర్ : డీల్

2024 సంవత్సరం చివరిలో ఇండియన్ మార్కెట్లో ఒక అద్భుతమైన బ్లూటూత్ స్పీకర్ ని శాంసంగ్ విడుదల చేసింది. అదే, samsung HW-LS60D/XL వాల్ ఫ్రేమ్ 2.0 డాల్బీ అట్మాస్ బ్లూటూత్ స్మార్ట్ స్పీకర్. ఈ బ్లూటూత్ స్పీకర్ ను రూ. 23,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, ఈరోజు ఈ స్మార్ట్ స్పీకర్ ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,990 రూపాయల అతి తక్కువ ధరలో సేల్ అవుతోంది.

Samsung Dolby Atmos speaker deal on flipkart sale

ఈ స్పీకర్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అదేమిటంటే, ఈ శాంసంగ్ బ్లూటూత్ స్మార్ట్ స్పీకర్ ని ఈరోజు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ. 1,399 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్పీకర్ కేవలం రూ. 12,591 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ స్పీకర్ ఈరోజు సగం ధరకే మీకు లభిస్తుంది.

Also Read: Noise Master Buds 2: BOSE సౌండ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!

Samsung Dolby Atmos స్పీకర్ : ఫీచర్స్

శాంసంగ్ ఈ స్మార్ట్ స్పీకర్ ని వాల్ ఫ్రేమ్ డిజైన్ తో అందించింది. అంటే, ఇది ఇంటికి ఒక మంచి వాల్ ఫ్రేమ్ లాగా ఉంటుంది మరియు గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్పీకర్ స్పేస్ ఫిట్ సౌండ్ ప్రో ఫీచర్ తో వస్తుంది మరియు మొత్తం 6 స్పీకర్లు కలిగి ఉంటుంది. అంటే, ఈ స్పీకర్ గది పరిమాణం అనలైజ్ చేసి సౌండ్ సరిచేస్తుంది. ఇది 2.0 ఛానల్ స్పీకర్ అయినా కూడా మొత్తం 6 స్పీకర్స్ తో 120W సౌండ్ అవుట్ పుట్ అందించి గది మొత్తం సౌండ్ తో నింపుతుంది.

Samsung Dolby Atmos speaker features

ఈ స్మార్ట్ స్పీకర్ వైర్లెస్ డాల్బీ అట్మాస్, అట్మాస్ మ్యూజిక్, డాల్బీ డిజిటల్ ప్లస్ అడాప్టివ్ సౌండ్ మరియు 2 ఛానల్ LPCM వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో యాక్టివ్ వాయిస్ ఆమ్ప్లిఫైర్ మరియు వాయిస్ మెరుగుదల వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది Wi-Fi కనెక్టివిటీ, ఆప్టికల్ కనెక్టివిటీ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ తో మంచి సెటప్ కలిగి ఉంటుంది. ఇది బిల్ట్ Alexa తో వస్తుంది మరియు నేరుగా Spotify వంటి మ్యూజిక్ ప్లేయర్ తో మ్యూజిక్ ప్లే చేయగలదు. అంతేకాదు, ఇది ఆపిల్ ఎయిర్ ప్లే 2 సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ స్పీకర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇది సూపర్ సౌండ్ అందించే పవర్ ఫుల్ అండ్ వెల్ డిజైన్ స్మార్ట్ స్పీకర్. ఇది మీ ఇంటి అలంకరణలో భాగంగా ఉంటుంది మరియు మైమరిపించే మ్యూజిక్ అందించే స్మార్ట్ స్పీకర్ గా కూడా ఉంటుంది. బిల్ట్ ఇన్ వైఫై తో స్మార్ట్ హబ్ గా అన్ని పరికరాలు నడిపించే శక్తి కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile