Noise Master Buds 2: BOSE సౌండ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!

HIGHLIGHTS

ఇండియన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ నోయిస్ ఈరోజు కొత్త బడ్స్ ను మార్కెట్లో విడుదల చేసింది

Noise Master Buds 2 ను కూడా బోస్ సౌండ్ తో జతగా అందించింది

ఈ కొత్త బడ్స్ ANC తో సహా మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది

Noise Master Buds 2: BOSE సౌండ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!

Noise Master Buds 2: ఇండియన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ నోయిస్ ఈరోజు కొత్త బడ్స్ ను మార్కెట్లో విడుదల చేసింది. Sound By BOSE తో మాస్టర్ సిరీస్ ను పరిచయం చేసిన నోయిస్ గత సంవత్సరం అందించిన నోయిస్ మాస్టర్ బడ్స్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ బడ్స్ ను కూడా బోస్ సౌండ్ తో జతగా అందించింది. ఈ కొత్త బడ్స్ ANC తో సహా మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Noise Master Buds : ప్రైస్

నోయిస్ మాస్టర్ బడ్స్ ను రూ. 7,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ బడ్స్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ ను అందించింది. ఈ బడ్స్ పై రూ. 1700 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ బడ్స్ కేవలం రూ. 6,299 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ బడ్స్ ఈరోజు నుంచి నోయిస్ అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను ఆరం, కార్బన్ మరియు మెర్క్యురీ ముందు రంగుల్లో అందించింది.

Noise Master Buds : ఫీచర్స్

ఇది నోయిస్ మాస్టర్ సిరీస్ మరియు Bose ట్యూనింగ్‌తో ప్రీమియం సౌండ్ అందిస్తుంది. ఇందులో 10mm PU డ్రైవర్స్ + PEEK డ్యూయల్ డ్రైవర్ సెటప్ ఉంటుంది. బోస్ ట్యూనింగ్ వల్ల ఇది మంచి బాస్, క్లియర్ వాయిస్ మరియు బ్యాలెన్స్‌డ్ సౌండ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అదనంగా, 360° స్పేషియల్ సౌండ్ మరియు హెడ్ ట్రాకింగ్ టెక్నాలజీ తో సినిమా థియేటర్ లాంటి గొప్ప ఎక్స్ పీరియన్స్ కూడా అందిస్తుంది. ఇందులో, Hi-Res Audio మరియు LHDC 5.0 సపోర్ట్ కూడా నోయిస్ అందించింది. ఈ నోయిస్ బడ్స్ 51dB ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) తో కూడా వస్తుంది.

Noise Master Buds Price and features

ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ బడ్స్ ముందుగా వచ్చిన అదే వినైల్ డిజన్ కలిగి ఉంటుంది. అయితే, ఈ కొత్త బడ్స్ మంచి ఫిట్ సపోర్ట్ కలిగిన కొత్త ఇయర్ బడ్స్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో కాలింగ్ కోసం 6 మైక్ ENC సపోర్ట్ అందించింది. ఈ ఫీచర్ తో ఈ బడ్స్ మంచి కాలింగ్ అందించే ఆకాశం ఉంటుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు టచ్ కంట్రోల్స్ కూడా అందించింది.

Also Read: కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.. ఎక్కడంటే.!

కనెక్టివిటీ పరంగా, ఈ కొత్త బడ్స్ ను బ్లూటూత్ వెర్షన్ 6.1 తో అందించింది. ఇది IPX5 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ను టోటల్ 30 గంటల ప్లే టైమ్ తో అందించింది. ఈ బడ్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది మరియు టైప్ C పోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile