BSNL Freedom Plan: రూ. 1 రూపాయి అన్లిమిటెడ్ ఆఫర్ డేట్ పొడిగించిన ప్రభుత్వ టెలికాం.!
BSNL Freedom Plan డేట్ మరింత పొడిగించినట్లు బిఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది
గత నెల ప్రత్యేకంగా తీసుకొచ్చిన రూ. 1 రూపాయి అన్లిమిటెడ్ ఆఫర్ క్లోజింగ్ డేట్ ను పెంచినట్లు ప్రకటించింది
బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ కేవలం రూ. 1 రూపాయి రీఛార్జ్ తో వస్తుంది
BSNL Freedom Plan: ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ గత నెల ప్రత్యేకంగా తీసుకొచ్చిన రూ. 1 రూపాయి అన్లిమిటెడ్ ఆఫర్ క్లోజింగ్ డేట్ ను పెంచినట్లు ప్రకటించింది. 2025 ఆగస్టు 15 సందర్భంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్ ఆగస్టు 31వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని ముందుగా తెలిపింది. అయితే, ఇప్పుడు ఈ ఆఫర్ క్లోజింగ్ డేట్ ను మరింత పొడిగించినట్లు బిఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది. బిఎస్ఎన్ఎల్ కొత్త అప్డేట్ మరియు రూ. 1 రూపాయి అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ చేసే ప్రయోజనాలు తెలుసుకోండి.
SurveyBSNL Freedom Plan డేట్ ఎప్పటి వరకు పెంచింది?
బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ డేట్ ను 15 రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే, బిఎస్ఎన్ఎల్ రూ. 1 రూపాయి అన్లిమిటెడ్ ఆఫర్ ఇప్పుడు సెప్టెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ పై ప్రజల నుంచి అందుకున్న గొప్ప స్పందన కారణంగా ఈ ఆఫర్ లేదా ప్లాన్ డేట్ ను 15 రోజులు పొడిగించినట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది.
BSNL Freedom Plan ప్రయోజనాలు ఏమిటి?
బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ కేవలం రూ. 1 రూపాయి రీఛార్జ్ తో వస్తుంది మరియు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. ఇదే కాదు రోజుకు 2 జీబీ డైలీ హై స్పీడ్ డేటా ఆఫర్ చేస్తుంది మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అంటే, ఓవరాల్ గా ఈ ప్లాన్ కేవలం ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.

అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, బిఎస్ఎన్ఎల్ కొత్త SIM కార్డు తీసుకునే వారికి మాత్రమే ఈ బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ వర్తిస్తుంది. బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు లను ఉచితంగా ఆఫర్ చేస్తుంది కాబట్టి కేవలం రూ. 1 రూపాయికే కొత్త సిమ్ కార్డు మరియు ఒక నెల అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. నెట్ వర్క్ మారాలని చూస్తున్న వారికి లేదా కొత్త మొబైల్ నెంబర్ తీసుకోవాలని చూస్తున్న వారికి ఈ కొత్త ఆఫర్ మంచి లాభదాయకంగా ఉంటుంది.
Also Read: క్రిస్టల్స్ పొదిగిన కొత్త MOTOROLA Razr 60 స్పెషల్ వేరియంట్ లాంచ్ చేసిన మోటోరోలా.!
ఇదే కాదు ఇప్పటికీ చాలా చవక ధరకే ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తున్న కంపెనీ గా బిఎస్ఎన్ఎల్ వెలుగొందుతోంది కాబట్టి తక్కువ ఖర్చుతో మొబైల్ నెంబర్ మైంటైన్ చేసే అవకాశం ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ కొత్త అప్డేట్ ప్రకారం, దేశంలో చాలా వేగంగా బిఎస్ఎన్ఎల్ 4జి నెట్ వర్క్ ను విస్తరిస్తోంది మరియు అన్ని రూరల్ ఏరియాలకు నెట్ వర్క్ కవరేజ్ అందించడానికి కృషి చేస్తున్నట్లు చెబుతోంది. రానున్న నెలల్లో దేశం మొత్తం పూర్తి కవరేజ్ అందించే దిశగా బిఎస్ఎన్ఎల్ పనులు చేపట్టింది.