Airtel Free OTT Plans: వినోదానికి పెద్దపీట వేస్తూ కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్టెల్.!
ఎయిర్టెల్ తన యూజర్లకు తీపి కబురు అందించింది
టెలికాం రంగంలో పోటీని మరింతగా పెంచుతూ ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త ప్లాన్స్ ప్రకటించింది
OTT ప్లాట్ ఫామ్స్ అయిన Netflix మరియు Jio Hotstar వంటి యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తుంది
Airtel Free OTT Plans: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తన యూజర్లకు తీపి కబురు అందించింది. ఇప్పటికే టెలికాం రంగంలో కొనసాగుతున్న పోటీని మరింతగా పెంచుతూ ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త ప్లాన్స్ ప్రకటించింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తో సూపర్ ఎంటర్టైన్మెంట్ OTT ప్లాట్ ఫామ్స్ అయిన Netflix మరియు Jio Hotstar వంటి యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
SurveyAirtel Free OTT Plans: ఏమిటా కొత్త ప్లాన్స్?
ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేస్తూ ఎయిర్టెల్ ఈరోజు రూ. 279, రూ. 598 మరియు రూ. 1,729 మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. ఈ మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ మరియు Zee5 యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
ఎయిర్టెల్ రూ. 279 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్టెల్ అందించిన కొత్త రూ. 279 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ బెస్ట్ ప్లాన్ మరియు 1 నెల చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో 1GB డేటా లభిస్తుంది మరియు 750 రూపాయల విలువైన OTT యాప్స్ యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ బేసిక్, Zee5 మరియు జియో హాట్ స్టార్ లకు యాక్సెస్ అందిస్తుంది. ఇది కాకుండా ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే ప్రీమియం తో ఆహా, సన్ నెక్స్ట్, ఈరోస్ నౌ, సోనీ లివ్, లయన్స్ గేట్ మరియు హోయ్ చోయ్ వంటి మరిన్ని యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది.

ఎయిర్టెల్ రూ. 598 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు పూర్తి చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు పైన ప్లాన్ అందించినా అన్నియు OTT లాభాలు ఈ ప్లాన్ కూడా అందిస్తుంది.
Also Read: Realme Buds Air 7 Pro: Ai లైవ్ తర్జుమా సపోర్ట్ తో రియల్ మీ బడ్స్ లాంచ్.!
ఎయిర్టెల్ రూ. 1,729 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ఎయిర్టెల్ లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 598 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేసే అన్ని లాభాలు 84 రోజులు అందిస్తుంది. అంటే, అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, డైలీ 100SMS ప్రయోజనాలతో పాటు నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ మరియు Zee5 యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
అంతేకాదు, ఆహా, సన్ నెక్స్ట్, లయన్స్ గేట్, ఈరోస్ నౌ, సోనీ లివ్ మరియు హోయ్ చోయ్ వంటి మరిన్ని వినోద యాప్స్ ను ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే ప్రీమియం ద్వారా యాక్సెస్ అందిస్తుంది.