Realme Buds Air 7 Pro: Ai లైవ్ తర్జుమా సపోర్ట్ తో రియల్ మీ బడ్స్ లాంచ్.!
రియల్ మీ కొత్త బడ్స్ ఈరోజు మార్కెట్లో లాంచ్ అయ్యాయి
Realme Buds Air 7 Pro బడ్స్ Ai లైవ్ తర్జుమా సపోర్ట్ తో లాంచ్ అయ్యింది
రియల్ మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో ఇయర్ బడ్స్ సరికొత్త Ai ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది
Realme Buds Air 7 Pro: రియల్ మీ కొత్త బడ్స్ ఈరోజు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. గత సంవత్సరం అందించిన రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో నెక్స్ట్ జనరేషన్ బడ్స్ గా వీటిని అందించింది. ఈ బడ్స్ Ai లైవ్ తర్జుమా సపోర్ట్ తో మరియు Hi-Res Audio వైర్లెస్ వంటి చాలా ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.
SurveyRealme Buds Air 7 Pro: ప్రైస్
రియల్ మీ లేటెస్ట్ ఇయర్ బడ్స్ రూ. 5,499 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యాయి. మే 30వ తేదీన ఈ బడ్స్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది. అమెజాన్ ఇండియా మరియు రియల్ మీ అఫీషియల్ సైట్ నుంచి ఈ బడ్స్ లభిస్తాయి. ఫెయిరీ రెడ్, గ్లోరీ బీజ్, మెటాలిక్ గ్రే మరియు రేసింగ్ గ్రీన్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.
Realme Buds Air 7 Pro: ప్రైస్
రియల్ మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో ఇయర్ బడ్స్ సరికొత్త Ai ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఎందుకంటే, ఈ బడ్స్ Ai ట్రాన్స్ లేషన్ ఫీచర్ కలిగి రియల్ టైం లో మాటలు తర్జుమా చేస్తుంది. ఇది యూజర్ ఇంటరాక్షన్ కు చక్కగా సహాయం చేస్తుంది. ఈ బడ్స్ సరికొత్త ఏవియేషన్ అల్యూమినియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ లో 11mm ఉఫర్ మరియు 6mm ట్వీటర్లు కలిపి డ్యూయల్ DAC డ్రైవర్ తో వస్తుంది. ఇది LHDC 5.0 మరియు హై రిజల్యూషన్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.

ఈ బడ్స్ 6 మైక్స్ మరియు AI డీప్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో గొప్ప కాలింగ్ అనుభూతిని అందిస్తుందని రియల్ మీ తెలిపింది. రియల్ మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో ఇయర్ బడ్స్ 53 dB నోయిస్ క్యాన్సిలేషన్ తో గొప్ప ANC అందిస్తుంది. అంతేకాదు, ఇందులో అందించిన 3D స్పటియల్ ఆడియో ఎఫెక్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది.
Also Read: Realme GT 7 రాకతో Realme GT 6 ప్రైస్ భారీగా తగ్గించిన రియల్ మీ.!
ఈ రియల్ మీ కొత్త బడ్స్ 45ms అల్ట్రా లో లెటెన్సీ ఫీచర్ తో గొప్ప గేమింగ్ అందిస్తుంది. ఈ బడ్స్ డ్యూయల్ డివైజ్ కనెక్షన్, స్విఫ్ట్ పెయిర్ మరియు రియల్ మీ లింక్ యాప్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. రియల్ మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో టోటల్ 48 గంటల ప్లే టైం అందిస్తుంది. ఈ బడ్స్ IP55 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.