Flipkart బిగ్ డీల్: కేవలం 18 వేలకే 43 ఇంచ్ Samsung 4K Smart Tv అందుకోండి.!
ఫ్లిప్ కార్ట్ ఈరోజు 43 ఇంచ్ Samsung 4K Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది
బిగ్ డీల్ తో కేవలం 18 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది
ఈ టీవీ యొక్క 5 యూనిట్లు మాత్రమే ఈ ఆఫర్ తో అందుబాటులో ఉన్నాయి
Flipkart బిగ్ డీల్: ఫ్లిప్ కార్ట్ ఈరోజు 43 ఇంచ్ Samsung 4K Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ బిగ్ డీల్ తో కేవలం 18 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది శాంసంగ్ యొక్క 4K స్మార్ట్ టీవీ మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ లో మీరు నోట్ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ టీవీ యొక్క 5 యూనిట్లు మాత్రమే ఈ ఆఫర్ తో అందుబాటులో ఉన్నాయి. అంటే, ఈ ఐదు యూనిట్స్ తో బుక్ అయితే ఈ ఆఫర్స్ క్లోజ్ అవుతుందని గమనించాలి.
SurveySamsung 4K Smart Tv : ఆఫర్
2024 సంవత్సరంలో శాంసంగ్ అందించిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ క్రిస్టల్ 4K విజన్ ప్రో స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ 54% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అవుట్ అయ్యింది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు PNB క్రెడిట్ కార్డ్ తో ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 18,749 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
Also Read: 540W Dolby 5.1 సౌండ్ బార్ అమెజాన్ భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తోంది.!
Samsung 4K Smart Tv : ఫీచర్స్
శాంసంగ్ యొక్క ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ HDR 10+, మోషన్ యాక్సిలరేటర్, మెగా కాంట్రాస్ట్ మరియు 4K అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 10W + 10W RMS సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ రెండు స్పీకర్లు కూడా ఫీల్ రేంజ్ స్పీకర్లు మరియు గొప్ప సౌండ్ అందిస్తాయి. దీనితో పాటు అడాప్టివ్ సౌండ్ మరియు Q – సింఫనీ వంటి అదనపు సౌండ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile