అద్భుతం: మార్స్ పైన మేఘాల ఫోటోలను పంపిన క్యూరియాసిటీ

అద్భుతం: మార్స్ పైన మేఘాల ఫోటోలను పంపిన క్యూరియాసిటీ
HIGHLIGHTS

క్యూరియాసిటీ కొత్త ఫోటోలను పంపింది

ఈ ఫోటోలు నెట్టింట్లో ఇప్పుడు అమితంగా వైరల్ కూడా అవుతున్నాయి

ఈ ఫోటోలలో మార్స్ పైన మేఘాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది

మార్స్ గ్రాహం యొక్క వివరాలను పరీశీలించేందుకు 2012 లో NASA పంపిన క్యూరియాసిటీ కొత్త ఫోటోలను పంపింది. అంతేకాదు, ఈ ఫోటోలు నెట్టింట్లో ఇప్పుడు అమితంగా వైరల్ కూడా అవుతున్నాయి. ఇందుకు కారణం కూడా పెద్దదే వుంది మరి. మార్స్ గ్రాహం పైన వుండే వాతావరణం కారణంగా అక్కడ మేఘాలు ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ, మార్స్ పైన ఏర్పడిన మేఘాలను అద్భుతంగా చిత్రీకరించిన క్యూరియాసిటీ, ఈ ఫోటోలను భూమికి పంపింది. ఈ ఫోటోలను నాసా అంతరిక్ష సంస్థ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Mars  740 .jpg

మార్స్ పైన మేఘాల ఫోటో

మార్స్ పైన వాతారణం తో పాటుగా మరిన్ని వివరాలను సేకరించేందుకు గాను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA, మార్స్ పైకి పంపిన క్యూరియాసిటీ ఈ ఫోటో లను పంపించింది. క్యూరియాసిటీ పంపిన ఈ ఫోటోలలో మార్స్ పైన మేఘాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రింద  ఫోటోలను చూడవచ్చు. 

Mars-2 740.jpg

మార్స్ పైన మేఘాల ఫోటో

క్యూరియాసిటీ రోవర్ పంపిన ఈ లేటెస్ట్ ఫోటోలతో మార్స్ పైన మేఘాలు ఏర్పడతావని అర్ధమవుతోంది. అయితే, ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఇంకా మార్స్ పైన ఎటువంటి వాతావరణ మార్పులు నెలకొంటాయి. అనేటటువంటి ఆసక్తికర కోణాలలో దృష్టిపెట్టే వీలుంటుంది. మార్స్ పైన ఇంకా ఏవైనా ఖనిజాలు మరియు లవణాలు ఉన్నాయనే వాటిని కూడా క్యూరియాసిటీ అన్వేసస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo