నవంబర్ లో లాంచ్ కానున్న 4జిబి ర్యామ్ కలిగిన Xiaomi మి 5

నవంబర్ లో లాంచ్ కానున్న 4జిబి ర్యామ్ కలిగిన Xiaomi మి 5
HIGHLIGHTS

Xiaomi మి 5 రెండు డిస్ప్లే సైజు లలో విడుదల కానుంది.

చైనిస్ సకేస్ఫుల్ బ్రాండ్ Xiaomi మి 5 ను ఈ సంవత్సరం నవంబర్ లో లాంచ్ చేయనుంది అని మొబైల్ డాడ్  సైటు చెబుతుంది. క్వాల్ కాం 820 SoC మరియు 4జిబి ర్యామ్ దీని ప్రధాన ఆకర్షణలు. 5.5 క్వాడ్ HD డిస్ప్లే, 3000 mah బ్యాటరీ, 16/64 జిబి స్టోరేజ్, 16 MP ఆప్టికల్ స్టేబిలైజేషన్ కెమేరా మరియు 8MP ఫ్రంట్ కెమేరా Xiaomi మి 5 స్పెసిఫికేషన్స్.

                          

5.5 in పెద్ద స్క్రీన్ మోడల్ 5.1 mm సన్నగా మొబైల్ మార్కెట్ లోనే అతి సన్నని మోడల్ గా విడుదల కానుంది అని తాజాగా జరిగిన లిక్స్ చెబుతున్నాయి. అయితే స్లిమ్ డివైజ్ లను దించటం పెద్ద సర్ప్రైజ్ ఏమి కాదు, ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు దాదాపు అన్ని మోడల్స్ సన్నని డిజైన్ లలో వస్తున్నాయి.

అయితే స్లిమ్ డిజైన్ లో ఉన్న ఇబ్బంది, ఫోన్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోవటం, బ్యాటరీ లైఫ్ ఉండకపోవటం. స్లిమ్ అవ్వటంతో ప్రాసెసర్ ఎంత పెద్దది అయినా, ర్యామ్ ఎంత ఎక్కువ జిబి తో వస్తున్న అవి లోపల ప్రాసెస్ అయ్యేందుకు సరైన గాలి లేకపోవటం వలన డివైజ్ లు వేడెక్కుతున్నాయి, తద్వారా పెర్ఫార్మెన్స్ ను కూడా తగ్గించేస్తున్నాయి. ఇది ప్రధానంగా Xiaomi మోడల్స్ లో కనపడుతుంది. తాజాగా Xiaomi మి 4i కి వేడెక్కతుంది అనే కారణం తో కంపెని ఒక సాఫ్టవేర్ అప్డేట్ ను కూడా విడుదల చేసింది అంటే తెలుసుకోండి ఇది ఎంత పెద్ద సమస్య గా ఉందో. అందుకే ప్రస్తుతానికి స్లిమ్ డివైజ్ లలో వేడెక్కకుండా ఉండే ప్రాసెసర్ ను కనిపెట్ట లేదు కాబట్టి, స్లిమ్ డివైజ్ లకు కొంచెం దూరం గా ఉండటం మంచిది. 

మి 5 మరో ప్రధాన ఆకర్షణ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ . అయితే ఇది టచ్ తో కాకుండా అల్ట్రా సౌండ్ సెన్సార్స్ తో పనిచేయనుంది అనే వార్తలు వినిపిస్తునాయి. ఇవి డస్ట్ మరియు వాటర్ పై కూడా సమర్ధంగా పనిచేయనున్నాయి. 5.5 in ఫోన్ తో పాటు 6 in మోడల్ మరొకటి లాంచ్ చేయనుంది Xiaomi. దీని ప్రత్యేకతలు – 2k డిస్ప్లే, బెజెల్ లేని స్క్రీన్. 
 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo