Redmi 13C 5G: బడ్జెట్ 5జి ఫోన్ తీసుకు వస్తున్న షియోమీ.!

Redmi 13C 5G: బడ్జెట్ 5జి ఫోన్ తీసుకు వస్తున్న షియోమీ.!
HIGHLIGHTS

మరో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం రెడీ అయ్యింది షియోమీ

Redmi 13C 5G ను విడుదల చేస్తున్నట్లు Xiaomi తెలిపింది

ఈ స్మార్ట్ ఫోన్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ మొదలు పెట్టింది

ఇండియన్ మార్కెట్ లో మరో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం రెడీ అయ్యింది షియోమీ. ముందుగా రెడ్ మి 13C స్మార్ట్ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు అనౌన్స్ చేసిన షియోమీ, ఇప్పుడు సిరీస్ నుండి Redmi 13C 5G ను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ నుండి లాంచ్ చేయబోతున్న స్మార్ట్ ఫోన్స్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Redmi 13C 5G launch Date

Redmi 13C 5G launch Date
రెడ్ మీ 13సి సిరీస్

రెడ్ మీ 13సి సిరీస్ నుండి రెండు ఫోన్ లను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇందులో, రెడ్ మి 13సి మరియు రెడ్ మి 13సి 5జి స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లను డిసెంబర్ 6న మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది. రెడ్ మి 13సి సిరీస్ అమేజాన్ స్పెషల్ గా లాంచ్ అవుతున్నాయి. అందుకే, అమేజాన్ ఈ సిరీస్ కోసం ప్రత్యేకమైన పేజ్ ద్వారా టీజింగ్ మొదలుపెట్టింది.

Also Read : boAt: 120 గంటల ప్లేబ్యాక్ మరియు Bionic Sound తో వచ్చే బెస్ట్ బడ్స్.!

రెడ్ మి సి13 5జి టీజ్డ్ స్పెక్స్

టీజర్ ఇమేజ్ ల ద్వారా రెడ్ మి సి13 5జి స్మార్ట్ ఫోన్ సన్నని మరియు సొగసైన డిజైన్ తో కనిపిస్తోంది. అంతేకాదు, వెరైటీ డిజైన్ మరియు కలర్ కలిగిన బ్యాక్ ప్యానల్ తో కూడా కనిపిస్తోంది. రెడ్ మి సి13 5జి స్మార్ట్ ఫోన్ ను MediaTek Dimensity 6100+ ప్రోసెస్ తో లాంచ్ చేస్తున్నట్లు షియోమి ప్రకటించింది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్ లతో కనిపిస్తోంది.

అలాగే, రెడ్ మి సి13 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమేరా జతగా LED ఫ్లాష్ తో అందించింది. ఇందులో, 50MP AI ప్రధాన కెమేరా ఉన్నట్లు షియోమి టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ యొక్క ఇతర స్పెక్స్ లేదా ఫీచర్లు కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించ లేదు.

రెడ్ మి సి13 5జి స్మార్ట్ ఫోన్ తో పాటుగా రెడ్ మి సి13 4జి స్మార్ట్ ఫోన్ ను కూడా షియోమి ఈ సిరీస్ నుండి లాంచ్ చేస్తోంది. రెడ్ మి సి13 4జి వేరియంట్ ను 50MP AI డ్యూయల్ కెమేరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ టీజర్ ద్వారా అనౌన్స్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

 
Digit.in
Logo
Digit.in
Logo