boAt: 120 గంటల ప్లేబ్యాక్ మరియు Bionic Sound తో వచ్చే బెస్ట్ బడ్స్.!
Boat మరిన్ని ఫీచర్స్ తో boAt Nirvana Ion ను లాంచ్ చేసింది
ENx™ టెక్నాలజీ మరియు బీస్ట్ లో లెటెన్సీ మోడ్ లతో వచ్చింది
ఇండియన్ ఫెమస్ బ్రాండ్ బోట్ నుండి అద్భుతమైన ఇయర్ బడ్స్
ఇండియన్ ఫెమస్ బ్రాండ్ బోట్ నుండి అద్భుతమైన ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా 120 గంటల ప్లేబ్యాక్ మరియు Bionic Sound వంటి మరిన్ని ఫీచర్స్ తో boAt Nirvana Ion ను లాంచ్ చేసింది. బోట్ ఇటీవల తీసుకు వచ్చిన ఈ బడ్స్ 2 వేల రూపాయల ఉప బడ్జెట్ లో ENx™ టెక్నాలజీ మరియు బీస్ట్ లో లెటెన్సీ మోడ్ మరియు ప్రీమియం డిజైన్ వంటి అన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ బోట్ ఇయర్ బడ్స్ ధర మరియు స్పెక్స్ తెలుసుకోండి.
SurveyboAt Nirvana Ion Price
బోట్ నిర్వాణా ఐయాన్ ఇయర్ బడ్స్ ను బోట్ రూ. 1,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ అమేజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ మరియు బోట్ అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తున్నాయి. అమేజాన్ ఇండియా నుండి నేరుగా కొనుగోలు చేయడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read : Youtube Gaming: డైరెక్ట్ గేమింగ్ కోసం Playables ఫీచర్ తెచ్చిన యూట్యూబ్.!
బోట్ నిర్వాణా ఐయాన్ ప్రత్యేకతలు
బోట్ నిర్వాణా ఐయాన్ ఇయర్ బడ్స్ ను ఎక్కువ కాలం ప్లేటైమ్ అందించే సత్తాతో తీసుకు వచ్చింది. ఈ ఇయర్ బడ్స్ పూర్తి కేస్ తో టోటల్ 120 గంటల ప్లేటైమ్ అందిస్తుందని తెలిపింది బోట్. ఇందులో అందించిన డ్యూయల్ ఈక్వలైజర్ మోడ్స్ తో ఈ ఇయర్ బడ్స్ Crystal Bionic Sound అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

అంతేకాదు, క్వాడ్ మైక్స్ ENx టెక్నాలజీతో ఎటువంటి అంతరాయం లేని కాలింగ్ ఫెసిలిటీ అందిస్తుంది. ఈ బడ్స్ 60ms లో లెటెన్సీ బీస్ట్ మోడ్ తో ల్యాగ్ ఫ్రీ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ బడ్స్ IPX4 రేటింగ్ తో చమటా మరియు నీటి తుంపర్ల నుండి రక్షణ కలిగి ఉంటుంది.
బోట్ నిర్వాణా ఐయాన్ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.2 సపోర్ట్ తో వస్తుంది మరియు Hifi DSP 5 చిప్ సెట్ తో బోట్ సిగ్నేచర్ మరియు బోట్ బ్యాలెన్సుడ్ సౌండ్ లను అందిస్తుంది.