Xiaomi 17 Ultra: 200MP లైకా పెరిస్కోప్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Xiaomi 17 Ultra స్మార్ట్ ఫోన్ ఈరోజు చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ 200MP పెరిస్కోప్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో వచ్చింది

8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది

Xiaomi 17 Ultra: 200MP లైకా పెరిస్కోప్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!

Xiaomi 17 Ultra స్మార్ట్ ఫోన్ ఈరోజు చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 200MP పెరిస్కోప్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో వచ్చింది. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. షియోమీ చైనా మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 17 Ultra: ఫీచర్స్

షియోమీ 17 అల్ట్రా స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్లో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయినట్లు చెబుతున్నారు. ఈ ఫోన్ లో 6.9 ఇంచ్ LTPO AMOLED స్క్రీన్ లేటెస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ HDR 10+ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ తో చైనాలో విడుదల చేసింది. ఇది ఫ్లాగ్‌ షిప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అందించే ప్రోసెసర్ మరియు జతగా 16 జీబీ LPDDR5x ర్యామ్ మరియు 1 టీబీ హెవీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Hyper OS 3.0 సాఫ్ట్‌ వేర్ మరియు ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుంది.

Xiaomi 17 Ultra

కెమెరా పరంగా ఈ ఫోన్ చాలా పవర్ ఫుల్ Leica కెమెరా సెటప్ కలిగి ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇందులో 50MP మెయిన్ (1 ఇంచ్) కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ ఉంది. అంతేకాదు, 50MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో వుంది. ఈ ఫోన్ 8K మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది ప్రో లెవల్ వీడియోలు మరియు సూపర్ రిజల్యూషన్ ఫోటోలు అందిస్తుందని షియోమీ తెలిపింది.

ఈ షియోమీ ఫోన్ 6,800 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇది IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో ఇండస్ట్రీ బెస్ట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: 400W SONY Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 18 వేలకే లభిస్తోంది.!

Xiaomi 17 Ultra: ప్రైస్

షియోమీ 17 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లో CNY 6,999 ( సుమారు రూ. 89,455) ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ గురించి ఇంకా ఎటువంటి వివరాలు అందించలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo