రైజింగ్ సెల్ఫీ కెమెరాతో విడుదలైన Oppo F11 Pro : ధర, స్పెక్స్ మరియు పూర్తి వివరాలు.

రైజింగ్ సెల్ఫీ కెమెరాతో విడుదలైన Oppo F11 Pro : ధర, స్పెక్స్ మరియు పూర్తి వివరాలు.
HIGHLIGHTS

ఇది Oppo F9 కంటే కూడా 20శాతం అధికమైన స్పీడుతో ఛార్జ్ చేయగలదు.

ఒప్పో సంస్థ తన Oppo F11 Pro స్మార్ట్ ఫోన్ను భారతదేశంలో ఒక 48MP వెనుక కెమెరాతో తీసుకువచ్చింది. ఇంకా, ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం  ట్రెండీగా వున్నా పాప్ అప్ కెమెరా మరియు గ్రేడియంట్ కలర్ 48MP ప్రధాన కెమేరాతో సహా అన్ని లక్షణాలను తీసుకువచ్చింది అయితే దీని సెల్ఫీ కెమెరాని రైజింగ్ కెమేరాగా పిలుస్తోంది ఒప్పో.    

Oppo F11 Pro  ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోనులో ప్రధానంగా వాటి కెమేరాల గురించి ప్రాచుర్యం పొందనుండి. ఎందుకంటే, దీని వేనుక భాగంలో వున్నా ప్రధాన కెమెరా ఒక 48MP Sony IMX586  సెన్సార్ తో అందిచబడింది. దాదాపుగా, 1/2 ఇంచ్ వుండే ఈ సెన్సార్ ముందుగా ప్రకటించిన రెడ్మి నోట్ 7 ప్రో అందించిన అదే సెన్సార్.

ఈ 48MP సెన్సార్ మరొక 5MP సెన్సార్ తో జత చేయబడింది, ఇది పోర్ట్రైట్ ఫోటోలను తీసుకోవడంలో సహాయ పడుతుంది. ఇందులో ముందు బాగంలోఒక రైజింగ్ – కెమెరా కూడా అందించారు సెల్ఫీల కోసం ఇది 16MP సోనీ సెన్సార్ తో అందించింది.

ఈ Oppo F 11Pro  ఒక 6.5-అంగుళాల IPSLCD డిస్ప్లేతో వస్తుంది మరియు మీడియా టెక్ హీలియో P70 SoC  శక్తితో నడుస్తుంది. అయితే, ఇది రూ.8999 ధరతో వచ్చిన రియల్మీ 3 లోవాడిన అదే ప్రాసెసర్ తో వచ్చింది. ఇది 6GB RAM మరియు 64GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఇందులోఒక ప్రధాన ప్రత్యకతగా    ఇందులో అందించిన VOOC 3.0 ఛార్జింగ్ గురించి చెప్పొచ్చు, ఇది Oppo F9 కంటే కూడా 20శాతం అధికమైన స్పీడుతో ఛార్జ్ చేయగలదు. అలాగే, ఇది ఒక  4,000 mAh బ్యాటరీతో వస్తుంది. 

Oppo F11 Pro ధర మరియు ఆఫర్లు

Oppo F11 Pro – 6GB + 64GB వేరియంట్ మాత్రమే రూ. 24,990 ధరతో విడుదల చేసింది మరియు ఇది మార్చి 15  నుండి అమ్మకాలను సాగించనుంది. ఇది అన్ని ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫారలా పైన అందుబాటులో ఉంటుంది. అన్ని ప్రధాన డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో కొనుగోలు ద్వారా 5% తక్షణ డిస్కౌంట్ అందుబాటులో వుంది. అలాగే, 12 నెలల EMI తో కొనుగోలు చేసేవారికి No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది.                

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo