iQOO Z11x 5G: పవర్ ఫుల్ మిడ్ రేంజ్ ఫోన్ గా లాంచ్ అయ్యింది.!
ఐకూ ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ గా పరిచయం చేసింది
7200mh భారీ బ్యాటరీ మరియు 1Mn+ AnTuTu స్కోర్ కలిగిన మీడియా టెక్ 5G చిప్ సెట్ కలిగి ఉంటుంది
iQOO Z11x 5G: ఐకూ ఈరోజు తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ గా పరిచయం చేసింది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ 7200mh భారీ బ్యాటరీ మరియు 1Mn కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే సత్తా కలిగిన మీడియా టెక్ లేటెస్ట్ 5G చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ రోజే భారత మార్కెట్లో సరికొత్తగా విడుదలైన ఈ ఐకూ జెడ్ 11x స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyiQOO Z11x 5G: ప్రైస్
ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB + 128GB) ని రూ. 18,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ మిడ్ వేరియంట్ (8GB + 128GB) ని రూ. 20,999 రూపాయల ప్రైస్ తో మరియు హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) ని రూ. 22,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది.

ఆఫర్స్
ఈ ఐకూ లేటెస్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు మిడ్ అండ్ హై ఎండ్ వేరియంట్స్ పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని ఐకూ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 17,499 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది.
Also Read: Sony Dolby soundbar పై అమెజాన్ సేల్ డిస్కౌంట్ .. 7 వేలకే సూపర్ సౌండ్ బార్ అందుకోండి.!
iQOO Z11x 5G: ఫీచర్స్
ఐకూ జెడ్ 11x స్మార్ట్ ఫోన్ ను 10 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7400 Turbo తో లాంచ్ చేసింది. ఇది గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ అదనపు ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ లో 6.78 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD + రిజల్యూషన్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 2MP డెప్త్ సెన్సర్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ తో పాటు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చెప్పుకోదగిన 7200mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, 44W Flash Charge ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. IP68 అండ్ IP69 రేటింగ్ తో ఈ ఫోన్ గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile