Xiaomi 17 Ultra: ఆల్ న్యూ పవర్ ఫుల్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్లో ఈరోజు షియోమీ తన లేటెస్ట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

Xiaomi 17 Ultra ఫోన్ ను 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ కెమెరా తో అందించింది

స్నాప్ డ్రాగన్ 3nm పవర్ ఫుల్ చిప్ సెట్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో అందించింది

Xiaomi 17 Ultra: ఆల్ న్యూ పవర్ ఫుల్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Xiaomi 17 Ultra: ఇండియన్ మార్కెట్లో ఈరోజు షియోమీ తన లేటెస్ట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే షియోమీ 17 అల్ట్రా స్మార్ట్ ఫోన్ మరియు ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన పవర్ ఫుల్ కెమెరా తో అందించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 3nm పవర్ ఫుల్ చిప్ సెట్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 17 Ultra: ప్రైస్

షియోమీ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్లు విడుదల చేసింది. ఈ ఫోన్ ను కేవలం 16 జీబీ + 51 2జీబీ సింగిల్ వేరియంట్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర ను రూ. 1,39,999 గా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ వైట్ అండ్ బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది. మార్చి 13వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫ్రీ ఆర్డర్స్ మొదలవుతాయి.

Xiaomi 17 Ultra Price

ఆఫర్స్:

షియోమీ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ను ముందుగా ప్రీ బుక్ చేసి యూజర్లకు ఫోటోగ్రాఫర్ కిట్టు ఉచితంగా అందించబోతున్నట్లు షియోమీ ప్రకటించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 10,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రకటించింది.

Xiaomi 17 Ultra: ఫీచర్స్

షియోమీ 17 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను 6.9 అంగుళాల షియోమీ హైపర్ RGB OLED డిస్‌ప్లే తో అందించింది. ఇది M10 కస్టమ్ డిస్ప్లే మరియు 12 బిట్ కలర్ డెప్త్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1 – 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ మరియు డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 3nm చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ చేసింది. ఈ సూపర్ ప్రోసెసర్ ను మరింత వేగంగా చేసే 16GB LPDDR5X RAM మరియు 512GB (UFS 4.1) స్టోరేజ్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది.

Xiaomi 17 Ultra Features

ఈ ఫోన్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP Leica లైట్ ఫ్యూజన్ కెమెరా, 200MP Samsung HPE (3.2x – 4.3x ఆప్టికల్ జూమ్) కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం అందించింది. ఈ సెటప్ తో ఈ ఫోన్ 30FPS వద్ద స్టేబుల్ 8K వీడియో రికార్డింగ్ మరియు 120FPS వద్ద 4K Dolby Vision వీడియో రికార్డింగ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ 4K డాల్బీ విజయం వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120x డిజిటల్ జూమ్ మరియు గొప్ప ఇమేజ్ లను అందించే సత్తా కలిగి ఉంది.

ఈ షియోమీ ప్రీమియం ఫోన్ 6000mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 90W వైర్డ్ హైపర్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ హైపర్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ లో షియోమీ Hyper AI సపోర్ట్ కూడా అందించింది. ఇవి కాకుండా ఫోన్ ను వేగంగా చల్లబరిచే 3D డ్యూయల్ ఛానల్ ఐస్ లూప్ కూలింగ్ సిస్టం కూడా జత చేసింది. ఈ ఫోన్ ప్రీమియం డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను Hi-Res ఆడియో మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Also Read: 525W 5.1 Dolby Soundbar ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డిస్కౌంట్ తో 6 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!

ఓవరాల్ గా ఈ ఫోన్ ను అత్యంత వేగంగా పని చేసే ప్రోసెసర్, బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్, గొప్ప డిస్ప్లే మరియు మంచి ఏఐ ఫీచర్స్ తో పవర్ ఫుల్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile