Vivo T5x 5G: సెగ్మెంట్ లో అత్యంత వేగవంతమైన స్మార్ట్ ఫోన్ గా వస్తోంది.!

HIGHLIGHTS

వివో బడ్జెట్ సిరీస్ అయిన వివో T సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది

ఈ అప్ కమింగ్ ఫోన్ Vivo T5x 5G గురించి చాలా గొప్పగా చెబుతోంది

సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైన ఫోన్ గా విడుదల చేస్తున్నట్లు కొత్త టీజర్ విడుదల చేసింది

Vivo T5x 5G: సెగ్మెంట్ లో అత్యంత వేగవంతమైన స్మార్ట్ ఫోన్ గా వస్తోంది.!

Vivo T5x 5G : వివో బడ్జెట్ సిరీస్ అయిన వివో T సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి చాలా గొప్పగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైన స్మార్ట్ ఫోన్ గా విడుదల చేస్తున్నట్లు వివో ఇప్పుడు కొత్త టీజర్ విడుదల చేసింది. అంతేకాదు, అందుకు తగిన కారణాలు కూడా వెల్లడిస్తూ టీజింగ్ చేస్తోంది. అందుకే ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మొబైల్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T5x 5G : లాంచ్ డేట్

వివో టి5x స్మార్ట్ ఫోన్ మార్చి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో చేయబడుతుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత వివో సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది.

Vivo T5x 5G : ఫీచర్స్

వివో టి5x స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ వివరాలు విడుదల చేసింది. ఈ ఫోన్ టీజర్ వివరాల ప్రకారం, ఈ ఫోన్ సరికొత్త సైబర్ గ్రీన్ మరియు స్టార్ సిల్వర్ రెండు కలర్ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ టర్బో పెర్ఫార్మన్స్ అందించే కొత్త చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్ మరియు తగిన బిగ్ ర్యామ్ తో కూడా ఉంటుంది.

Vivo T5x 5G Launch date and features

ఈ ఫోన్ ను సెగ్మెంట్ లో ఎన్నడూ చూడని పెద్ద బ్యాటరీ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా వివో గొప్పగా చెబుతోంది. అయితే, ఈ ఫీచర్ ని మార్చి 13వ తేదీ రివీల్ చేస్తుందట. అయితే, ఈ ఫోన్ ను 7000mAh నుంచి 7200mAh సామర్ధ్యం కలిగిన భారీ బ్యాటరీతో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. ఇదే కనుక నిజం అయితే ఈ ఫోన్ గత జనరేషన్ ఫోన్ కంటే పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ మంచి డ్యూరాబిలిటీ తో లాంచ్ అవుతుందని కూడా వివో టీజర్ లో తెలిపింది. ఈ ఫీచర్ ను కూడా మార్చి 14వ తేదీ వ్ రివీల్ చేస్తుంది. ఇది SGS MIL మిలటరీ గ్రేడ్ షాక్ ప్రూఫ్ తో మంచి పటిష్టమైన డిజైన్ కలిగి ఉండే అవకాశం ఉండవచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్ లేటెస్ట్ ఆరిజిన్ సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుందని కూడా లీక్స్ చెబుతున్నాయి.

Also Read: Xiaomi 17 Ultra: ఆల్ న్యూ పవర్ ఫుల్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా ఉందని తెలుస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా జతగా 2MP 2MP లేదా 5MP డెప్త్ కెమెరా ఉండొచ్చని లీక్స్ తెలిపాయి. అయితే, ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉండే అవకాశం ఉండవచ్చు. ఈ ఫోన్ ఫీచర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది కాబట్టి, ఈ ఫోన్ ఫీచర్స్ లో మనం అంచనా వేసిన ఫీచర్స్ లో ఎన్ని నిజం అవుతాయో త్వరలోనే తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile