vivo Y400 Pro లాంచ్ అనౌన్స్ చేసిన వివో: అంచనా ఫీచర్స్ తెలుసుకోండి.!
vivo Y400 Pro స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేయడానికి సిద్దమయ్యింది
వివో వై 400 సిరీస్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది
ఈ ఫోన్ కోసం కంపెనీ అందించిన ట్వీట్ నుంచి ఈ ఫోన్ గొప్పగా చెప్పింది
vivo Y400 Pro స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేయడానికి సిద్దమయ్యింది. వివో వై 400 సిరీస్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది. వివో ఈ ఫోన్ లాంచ్ గురించి అనౌన్స్ చేసిన వెంటనే X నుంచి ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ మరియు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ప్రైస్ వివరాలు కూడా దర్శనమిచ్చాయి. ఈ ఫోన్ కోసం కంపెనీ అందించిన ట్వీట్ నుంచి ఈ ఫోన్ గొప్పగా చెప్పింది. ఆన్లైన్ ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయనుకోండి.
vivo Y400 Pro : లాంచ్
వివో వై 400 ప్రో స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు వివో అనౌన్స్ చేసింది. Coming Soon ట్యాగ్ లైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గ్లిమ్స్ మాత్రం అందించింది. ఈ గ్లింప్స్ వీడియోలో ఈ ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ కనిపించేలా చేసింది. ఈ టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా, ఆరా రింగ్ లైట్ మరియు స్లీక్ డిజైన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
vivo Y400 Pro : అంచనా ఫీచర్స్
వివో వై 400 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 5G చిప్ సెట్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ స్క్రీన్ అధిక బ్రైట్నెస్ మరియు అధిక రిజల్యూషన్ కలిగి ఉండవచ్చని కూడా అంచనా వేసి చెబుతున్నారు.
వివో వై 400 ప్రో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ, ఛార్జ్ మరియు కెమెరా వివరాలు కూడా అంచనా అంచనా వేస్తున్నారు. వివో ఈ ఫోన్ ను 50MP Sony ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ను 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ తో అందించే అవకాశం ఉంటుంది.
Also Read: కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేస్తున్న boAt
వాస్తవానికి, ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ ఇమేజ్ లను సైతం నెట్టింట్లో విడుదల చేశారు. అయితే, కంపెనీ నుంచి అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఇవన్నీ కూడా అంచనా ఫీచర్స్ గా భావించాలి. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా వెల్లడించే అవకాశం వుంది.