కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేస్తున్న boAt
boAt, కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో తీసుకొస్తున్నట్లు బోట్ టీజింగ్ చేస్తోంది
ఈ సౌండ్ బార్ కీలక ఫీచర్స్ తో బోట్ టీజింగ్ మొదలుపెట్టింది
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ boAt, కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ సౌండ్ బార్ ను స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో తీసుకొస్తున్నట్లు బోట్ టీజింగ్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ కీలక ఫీచర్స్ తో బోట్ టీజింగ్ మొదలు పెట్టింది మరియు ఈ సౌండ్ లాంచ్ కోసం నోటిఫికేషన్ బటన్ తో టీజింగ్ చేస్తోంది.
boAt 5.1 Dolby Atmos Soundbar
బోట్ అప్ కమింగ్ సౌండ్ బార్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ సౌండ్ బార్ కీలక ఫీచర్లు మరియు ఇన్ఫర్మేషన్ తో అమెజాన్ నుంచి టీజింగ్ మాత్రం మొదలుపెట్టింది. అమెజాన్ ఈ సౌండ్ బార్ వివరాలతో టీజింగ్ పేజీ అందించింది. ఈ ప్రత్యేకమైన టీజర్ పేజి నుంచి బోట్ అప్ కమింగ్ సౌండ్ బార్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించింది. ఆఫ్ కోర్స్ ఈ సౌండ్ బార్ ప్రైస్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.
boAt 5.1 Dolby Atmos Soundbar : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ సరికొత్త మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను స్లీక్ మరియు గ్లాసీ డిజైన్ తో అందిస్తోంది మరియు ముందు ప్రీమియం మెస్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అప్ కమింగ్ సౌండ్ బార్ ను Avante Premium 5.1 5000 DA పేరుతో లాంచ్ లాంచ్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుందని బోట్ తెలిపింది.
ఈ సౌండ్ బార్ సెటప్ లో మొత్తం ఆరు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ BASS అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో సినిమాటిక్ సౌండ్ అందిస్తుందని బోట్ ఈ సౌండ్ బార్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ సౌండ్ బార్ మూవీ, న్యూస్ మరియు మ్యూజిక్ మూడు సౌండ్ మోడ్స్ కలిగి ఉంటుంది.
Also Read: అతి చవక ధరలో Lava Storm Lite 5G ఫోన్ చేసిన లావా.!
ఇక ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ HDMI e-Arc, USB, ఆప్టికల్, AUX మరియు లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ క్రేజ్ కు తగ్గట్టుగా ఈ సౌండ్ బార్ ను తీసుకు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సౌండ్ బార్ ప్రైస్ రివీల్ అయిన తర్వాత ఈ సౌండ్ బార్ మార్కెట్ లో ఎటువంటి సెగ్మెంట్ ను టార్గెట్ చేస్తుందో అర్థం అవుతుంది.