vivo X500 Series ఇండియా లాంచ్ డేట్ ని వివో కన్ఫర్మ్ చేసింది .. కెమెరా ప్రియులకు పండగే.!
vivo X500 Series ఇండియా లాంచ్ డేట్ ని ఈరోజు వివో కన్ఫర్మ్ చేసింది
గత వారం రోజులుగా ఈ స్మార్ట్ ఫోన్ గురించి వివో టీజింగ్ చేస్తూ వచ్చింది
ఈ ఫోన్ లో ఉండే కెమెరా ఫీచర్స్ తో కెమెరా ప్రియులకు పండగే
vivo X500 Series ఇండియా లాంచ్ డేట్ ని ఈరోజు వివో కన్ఫర్మ్ చేసింది. గత వారం రోజులుగా ఈ స్మార్ట్ ఫోన్ గురించి వివో టీజింగ్ చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు ఈ అప్ కమింగ్ సిరీస్ ఇండియా లాంచ్ డేట్ ని కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ ని ఇండియన్ మార్కెట్లో కూడా లాంచ్ చేయడానికి వివో సన్నద్ధమయ్యింది. ఈ ఫోన్ లో ఉండే కెమెరా ఫీచర్స్ తో కెమెరా ప్రియులకు పండగే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
vivo X500 Series ఎప్పుడు లాంచ్ అవుతుంది?
వివో X 500 సిరీస్ ఫోన్ లను నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు వివో డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ నుంచి X500 Pro Max స్మార్ట్ ఫోన్ ను టెలిఫోటో AF ట్రాకింగ్ వీడియో వంటి ప్రీమియం స్పెక్స్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో టీజింగ్ చేసింది.
vivo X500 Series స్మార్ట్ ఫోన్స్
వివో ఎక్స్ 500 సిరీస్ నుంచి వివో X500, వివో X500 ప్రో మరియు వివో X500 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ లతో పాటు వివో Watch GT2 ని కూడా లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది.
vivo X500 Series స్మార్ట్ ఫోన్స్
వివో ఎక్స్ 500 సిరీస్ నుంచి వివో X500, వివో X500 ప్రో మరియు వివో X500 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ లతో పాటు వివో Watch GT2 ని కూడా లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది.
ఈ అప్ కమింగ్ ఫోన్ లీక్డ్ ఫీచర్స్ ఏమిటి?
ఈ అప్ కమింగ్ సిరీస్ ఫీచర్ల గురించి ఇప్పటికే అనేక లీక్స్ ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. ఈ లీక్స్ ప్రకారం, X500 ఫోన్ 6.59 ఇంచ్ OLED డిస్ప్లేని 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. వివో ఈ అప్ కమింగ్ సిరీస్ ఫోన్లలో Dimensity 9600M ప్రాసెసర్ ని అందిస్తుంది. అంతేకాదు, ఈ సిరీస్ లో 7,500mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది ఈ బీసీకే వేరియంట్ గురించి లీక్స్ చెబుతున్న విషయాలు.
ఇక X500 ప్రో మోడల్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇందులో 6.36 ఇంచ్ LTPO OLED డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9600 Pro అందించే అవకాశం ఉంది. అలాగే, ఈ ఫోన్ లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6,510 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉండవచ్చు.
ఈ సిరీస్ టాప్ మోడల్ స్మార్ట్ ఫోన్ X500 ప్రో మాక్స్ లీక్డ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.85 ఇంచ్ LTPO OLED డిస్ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 2K రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే 8,000mAh మాక్స్ భారీ మరియు అత్యున్నత ఫాస్ట్ ఛార్జ్ బ్యాటరీ ఉండవచ్చని అంచనా. ఇక కెమెరా విషయానికి వస్తే, ఇందులో 200MP పెరిస్కోప్ కెమెరా ఉండవచ్చని సమాచారం. ఇది మాత్రమే కాదు ఇందులో వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
అయితే, ఇవన్నీ అంచనా మరియు లీక్డ్ ఫీచర్స్ మాత్రమే అని మీరు గమనించాలి. ఈ సిరీస్ ఫోన్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ వివో త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ అంచనా మరియు లీక్డ్ ఫిచ్ర్స్ లో ఎన్ని నిజం అవుతాయో అప్పుడు తెలుస్తుంది.