vivo X200T ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన వివో.. ఫోన్ ఎలా ఉందంటే.!
vivo X200T స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ను వివో కన్ఫర్మ్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ టీజింగ్ కూడా స్టార్ట్ చేసింది
ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ తో ఈ ఫోన్ లాంచ్ టీజర్ ని విడుదల చేసింది
vivo X200T స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ను వివో కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ టీజింగ్ కూడా స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ తో ఈ ఫోన్ లాంచ్ టీజర్ ని విడుదల చేసింది. ఇందులో ఈ ఫోన్ కలిగిన పవర్ ఫుల్ కెమెరా సెటప్ ను చూపించింది. అయితే, ఈ ఫోన్ అప్పర్ మిడ్ రేంజ్ ఫోన్ గా రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న విశేషాలు ఏమిటో చూసేద్దామా.
Surveyvivo X200T: ఇండియా లాంచ్ డేట్ ఏమిటి?
వివో ఎక్స్ 200 టి స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా అనౌన్స్ కాలేదు. అంటే, ఈ ఫోన్ లాంచ్ డేట్ ను వివో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ ఫిబ్రవరి నెల ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
vivo X200T : ఫీచర్స్ ఏమిటి?
వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కెమెరా సెటప్ మరియు ఈ ఫోన్ డిజైన్ వివరాలు తెలియ వస్తున్నాయి. కానీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ నెట్టింట్లో దర్శనమిచ్చాయి. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ కెమెరా సెటప్ ZEISS ఆప్టిక్స్ తో కలిగి ఉంటుంది. ఇందులో మూడు బిగ్ సెన్సార్లు మరియు ఒఇక టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఈ వివరాలు ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ను చూస్తే మనకు అర్థం అయ్యే ఫీచర్స్.
అంచనా ఫీచర్స్
ఐకే ఈ ఫోన్ గురించి విశ్లేషకులు మరియు మార్కెట్ వర్గాలు వేస్తున్న అంచనా ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం. వివో ఈ అప్ కమింగ్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 9400+ తో లాంచ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, ఇందులో 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.1 స్టోరేజ్ ఉండొచ్చని కూడా చెబుతున్నారు.

ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ లో 50MP Sony LYT-702 ప్రైమరీ (OIS), 50MP శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ మరియు 50MP Sony LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్లు ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ ఫోన్ స్టేబుల్ 4K వీడియో సపోర్ట్, AI కెమెరా ఫీచర్లు మరియు వివో ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 6,200 mAh పెద్ద బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.
Also Read: సేల్ నుంచి Sony Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!
అయితే, ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ కంపెనీ వెల్లడించే వరకు మనం మాట్లాడుకుంది అంచనా స్పెక్స్ గానే పరిగణించాలి. మరి ఏ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ వివో ఎప్పుడు విడుదల చేస్తుందో చూద్దాం.