Vivo X Fold 3 Pro లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో.!

Vivo X Fold 3 Pro లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో.!
HIGHLIGHTS

Vivo X Fold 3 Pro లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో

ఈ ఫోల్డ్ ఫోన్ ను వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది

వివో ఇండియా X అకౌంట్ నుండి ఈ లాంచ్ డేట్ ను కన్ఫర్మ్ చేసింది

Vivo X Fold 3 Pro లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన వివో. ఇండియాలో విడుదల చేయనున్న మొదటి ఫోల్డ్ ఫోన్ ను వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లాంచ్ డేట్ తో అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా మరిన్ని వివరాలను కూడా తెలిపింది. ఈ అప్ కమింగ్ వివో ఫోల్డ్ ఫోన్ పై ఒక లుక్కేద్దామా.

Vivo X Fold 3 Pro Launch

Vivo X Fold 3 Pro launch Date
Vivo X Fold 3 Pro launch Date

వివో X ఫోల్డ్ 3 ప్రో ఫోల్డ్ ఫోన్ ను ఇండియాలో జూన్ 6వ తేదీన విడుదల చేసినట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటుగా ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కూడా వెల్లడించింది. ఈ ఫోన్ టీజర్ పేజ్ ద్వారా ఈ ఫోన్ లో వున్నా కెమెరా మరియు డిస్ప్లే వివరాలు కూడా బయటకు వచ్చాయి. వివో ఇండియా X అకౌంట్ నుండి ఈ లాంచ్ డేట్ ను కన్ఫర్మ్ చేసింది.

Vivo X Fold 3 Pro ఎలాంటి వివరాలను కలిగి వుంది?

వివో X ఫోల్డ్ 3 ప్రో ఫోల్డ్ ఫోన్ చాలా సన్నని మరియు గొప్ప డిజైన్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు కేవలం 11.2mm మందంతో చాలా సన్నగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ 236 గ్రాముల బరువుతో ఉన్నట్టు కూడా కంపెనీ తెలిపింది.

Also Read: Flipkart Big Deal: 20 వేల బడ్జెట్ లో పెద్ద QLED Smart Tv అందుకోండి.!

ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో Zeiss ఆప్టిక్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం ఉన్నట్లు క్లియర్ చేసింది. ఇందులో Zeiss టెలిఫోటో కెమెరా, Zeiss మల్టి ఫంక్షనల్ పోర్ట్రైట్ ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ కెమెరా 24mm నుండి 100mm వరకు మల్టిఫుల్ ఫంక్షనల్ ఫోకాల్ లెంగ్త్ లను కలిగి ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది.

ఈ ఫోల్డ్ ను Google యొక్క లేటెస్ట్ AI ఇంజిన్ Gemini AI తో తీసుకు వస్తున్నట్లు కూడా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 100W డ్యూయల్ సెల్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5700mAh హెవీ బ్యాటరీ కూడా వుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo