BSNL Best Plan: కేవలం రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో 42 రోజులు లాభాలు అందుకోండి.!

HIGHLIGHTS

BSNL Best Plan ఈ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే

ఈ ప్లాన్ కేవలం రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో 42 రోజులు కాలింగ్ మరియు డేటా వంటి అన్ని లాభాలు అందిస్తుంది

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతుంది

BSNL Best Plan: కేవలం రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో 42 రోజులు లాభాలు అందుకోండి.!

BSNL Best Plan: తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు కాలింగ్, డేటా మరియు ఇతర లాభాలు అందుకోవాలంటే, బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఈ ప్లాన్ కేవలం రూ. 200 కంటే తక్కువ ఖర్చుతో 42 రోజులు కాలింగ్ మరియు డేటా వంటి అన్ని లాభాలు అందిస్తుంది. వాస్తవానికి, ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచే పనిలో ఉంటే బిఎస్ఎన్ఎల్ చాలా చవక రేటుకే తన ప్రీపెయిడ్ ప్లాన్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL Best Plan: ఏమిటి ఈ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ తన యూజర్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు కాలింగ్ మరియు డేటా లాభాలు అందించే ఒక ప్లాన్ అందించింది. అదే, రూ. 197 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ 42 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

BSNL Best Plan: రూ. 197 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 197 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 42 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అయితే, ఇది అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ కాదు. ఈ ప్లాన్ తో 42 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను 300 మినిట్స్ లోకల్/STD కాల్స్ ఆఫర్ చేస్తుంది. ఇదే కాదు ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి 4GB హాయ్ స్పీడ్ డేటా అందిస్తుంది మరియు ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో 42 రోజులు అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఇవి కాకుండా 42 రోజులకు గాను టోటల్ 100 SMS వినియోగ ప్రయోజనాలు అందిస్తుంది.

BSNL Best Plan Rs 197 prepaid plan

ఇది చాలా చవక ధరలో ఆల్ రౌండ్ ప్రయోజనాలు అందించే ప్లాన్ గా ఉంటుంది. అయితే, ఎక్కువ కాలింగ్ మరియు డైలీ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ అంతగా నప్పదు. ఈ ప్లాన్ అందించే లిమిటెడ్ బెనిఫిట్స్ ముగిసిన తర్వాత ఈ ప్లాన్ తో అదనపు ఛార్జ్ లు వర్తిస్తాయి.

అంటే, ఈ ప్లాన్ తో వచ్చే కాలింగ్ మరియు డేటా బెనిఫిట్స్ ముగిసిన తర్వాత లోకల్ కాల్ కోసం నిమిషానికి రూ. 1, STD కాల్ కోసం నిమిషానికి రూ. 1.3 చెల్లించాలి. అలాగే, వీడియో కాల్ కోసం నిమిషానికి రూ. 2, లోకల్ SMS కోసం 80 పైసలు మరియు నేషనల్ SMS కోసం రూ. 1.20 చెల్లించాల్సి వస్తుంది. ఇక డేటా విషయానికి వస్తే, ఒక MB హై స్పీడ్ డేటా కోసం 25 పైసలు బిఎస్ఎన్ఎల్ ఛార్జ్ చేస్తుంది.

Also Read: Samsung Galaxy A07 5G బిగ్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

అయితే, మినిమమ్ కాలింగ్ మరియు తక్కువ డేటా మాత్రమే కోరుకునే వారికి ఇది చాలా బెస్ట్ ప్లాన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo