Vivo V70 FE 5G sale starts on 9 april 2026 with big launch offers and deals
Vivo V70 FE 5G: వివో సరికొత్తగా విడుదల చేసిన భారీ 200MP కెమెరా స్మార్ట్ ఫోన్ వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ తో స్టార్ట్ అవుతోంది. ఈ ఫోన్ ప్రస్తుతం ముందస్తు బుకింగ్స్ కోసం అందుబాటులో ఉంది. అయితే, ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన ధరలో భారీ 200MP కెమెరా వంటి ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కంటే ముందే ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ అండ్ ఫీచర్స్ కంప్లీట్ గా తెలుసుకోండి.
ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 37,999 ధరతో లాంచ్ చేసింది. అలాగే, వివో వి70FE (8 జీబీ + 256 జీబీ) మిడ్ వేరియంట్ ను రూ. 40,999 ధరతో మరియు ఈ ఫోన్ హై ఎండ్ (12 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 44,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ వివో ఫోన్ నాథర్న్స్ లైట్ పర్పల్ మరియు మాన్సూన్ బ్లూ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై భారీ డీల్ మరియు ఆఫర్లు అందించింది. Axis మరియు Kotak బ్యాంక్ కార్డ్ ఆప్షన్ పై 10% తక్షణ డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ పై 10% అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా జత చేసింది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ పై గరిష్టంగా రూ. 4,100 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లు కాకుండా ఈ ఫోన్ పై 1 సంవత్సరం అదనపు వారంటీ కూడా అందించింది. అంటే, ఈ ఫోన్ పై డబుల్ ధమాకా అందుకోవచ్చు.
వివో ఈ ఫోన్ ను 6.83 ఇంచ్ బిగ్ OLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ ను సరికొత్త డార్క్ నెస్ గ్లో టెక్నాలజీ తో అందించింది. వెలుగు లేనప్పుడు ఈ ఫోన్ మంచి గ్లో తో మెరిసిపోతుంది. ఇక చిప్ సెట్ విషయానికి వస్తే, వి 70 FE ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360 Turbo ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ తో కూడా వస్తుంది.
ఈ వివో ఫోన్ భారీ 200MP మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరాని అల్ట్రా స్టేబుల్ గా నిలపగల OIS అండ్ EIS సపోర్ట్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. అదనంగా, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది కాకుండా 4K వీడియో మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Xiaomi బిగ్ QLED Smart Tv పై బిగ్ డిస్కౌంట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
బ్యాటరీ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.