Xiaomi బిగ్ QLED Smart Tv పై బిగ్ డిస్కౌంట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

HIGHLIGHTS

Xiaomi 55 ఇంచ్ బిగ్ QLED Smart Tv పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ ప్రకటించింది

డాల్బీ సౌండ్ సపోర్ట్ మరియు HDR 10+ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది

ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది

Xiaomi బిగ్ QLED Smart Tv పై బిగ్ డిస్కౌంట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

Xiaomi ఇండియాలో ఇటీవల అందించిన 55 ఇంచ్ బిగ్ QLED Smart Tv పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ బిగ్ స్టోరేజ్, డాల్బీ సౌండ్ సపోర్ట్ మరియు HDR 10+ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు కుదిపిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్లు అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi QLED Smart Tv : ఆఫర్

షియోమీ ఫైర్ టీవీ సిరీస్ FX Pro నుంచి అందించిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ L55MB-FPIN మోడల్ పై ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ 43% భారీ డిస్కౌంట్ తో రూ. 35,999 రేటుతో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల HDFC క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది.

అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై అందించిన ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 32,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Xiaomi (55) QLED Smart Tv : ఫీచర్స్

ఈ షియోమీ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ LED కంటే ఎక్కువ క్లియర్ విజువల్స్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ టీవీ HDR 10+, HDR10, HLG మరియు వివిద్ పిక్చర్ ఇంజిన్ 2 వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Fire TV తో వస్తుంది మరియు అన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఎక్కువ యాప్స్ స్టోర్ చేయడానికి వీలుగా 32 జీబీ బిల్ట్ ఇన్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

Xiaomi QLED Smart Tv deal on amazon

ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 34W సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో, DTS-X మరియు DTS Virtual : X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, HDMI, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Realme Narzo 100 Lite 5G: బడ్జెట్ సిరీస్ నుంచి స్టన్నింగ్ ఫోన్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!

ఈ షియోమీ స్మార్ట్ టీవీ 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అమెజాన్ యూజర్ల నుంచి అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo