OPPO F35 Pro 5G గ్రూప్ సెల్ఫీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

OPPO F35 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడింది

ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్ గా లాంచ్ అయ్యింది

50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా మరియు భారీ బ్యాటరీ వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

OPPO F35 Pro 5G గ్రూప్ సెల్ఫీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

OPPO F35 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్ గా లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా మరియు భారీ బ్యాటరీ వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ తో గొప్ప ఆఫర్స్ ని కూడా ఒప్పో అందించింది. మరి ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తో పాటు ఆఫర్ వివరాలు కూడా తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO F35 Pro 5G : ప్రైస్

ఒప్పో ఈ ఫోన్ ను మొత్తం మూడు ర్యామ్ అండ్ స్టోరేజ్ తో పాటు మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

  • ఒప్పో ఎఫ్ 35 ప్రో (6GB + 128GB) ప్రైస్ : రూ. 45,999
  • ఒప్పో ఎఫ్ 35 ప్రో (8GB + 128GB) ప్రైస్ : రూ. 49,999
  • ఒప్పో ఎఫ్ 35 ప్రో (8GB + 256GB) ప్రైస్ : రూ. 54,999

ఈ ఫోన్ ను వేవ్ బ్లూ, సన్ రైజ్ ఆరెంజ్ మరియు ట్విలైట్ బ్రౌన్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్ లో విడుదల చేసింది.

OPPO F35 Pro 5G Offers

ఆఫర్స్

ఈ ఫోన్ ను భారీ లాంచ్ ఆఫర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై 10% ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు 10%తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది. ఇవి కాకుండా ఈ ఫోన్ పైన 1 ఇయర్ అదనపు వారంటీ, 9 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ తో పాటు పాయింట్స్ బెనిఫిట్ ఆఫర్ లను ఒప్పో ఈ ఫోన్ పై అందించింది.

Also Read: 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని కేవలం రూ. 8,999 చవక రేటుకే సేల్ చేస్తున్న Flipkart Sale

OPPO F35 Pro 5G : ఫీచర్స్

ఒప్పో ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో అందించింది. ఇందులో 6.77 ఇంచ్ AMOLED ఫ్లెక్సిబుల్ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ AGC DT-Star D+ గ్లాస్, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360 MAX చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ తో లాంచ్ చేసింది.

ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే, ముందు కూడా 50MP గ్రూప్ సెల్ఫీ ప్రీమియం సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన ఫ్రెంట్ అండ్ బ్యాంక్ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ చేసే సత్తా కలిగి ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ తో పాటు సరికొత్త ఒప్పో కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్ 8000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. అయితే, ఇంత పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా ఈ ఫోన్ కేవలం 8.4mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 80W SUPER VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది. అలాగే, డ్యూరాబిలిటీ కోసం ఈ ఫోన్ లో మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను IP69K రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile