How to Make Your smartphone More Secure explained in telugu
నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. బ్యాంకింగ్, ఆన్ లైన్ షాపింగ్, సోషల్ మీడియా, వ్యక్తిగత ఫోటోలు, ఇమెయిల్స్ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాల కోసం ప్రతి ఒక్కరూ ఎక్కుగా ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. అయితే, మనం ఉపయోగించే ఫోన్ లో వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఉండటం వల్ల సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు మరియు మోసగాళ్లకు మన ఫోన్ ఒక ఫేవరెట్ లక్ష్యంగా మారుతోంది. అందుకే, ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవడం నేటి కాలంలో చాలా ముఖ్యమైన విషయంగా మారింది. కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంక్ వివరాలను, ఆన్ లైన్ ఖాతాలను మరింత భద్రంగా ఉంచుకోవచ్చు. మీ Smartphone ను మరింత సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి అని కంప్లీట్ గైడ్ ని ఈరోజు ఇక్కడ అందించాము.
ఈ ఆర్టికల్ లో మీ ఫోన్ ను మరింత సురక్షితంగా మార్చుకోవడానికి సహాయం చేసే 10 ముఖ్యమైన చిట్కాలు అందించాము.
మీ ఫోన్ భద్రతకు మొదటి అడుగు మీ ఫోన్ స్క్రీన్ లాక్. అనుకోకుండా మీ ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్ళినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి ఇది సహాయపడుతుంది. ఈ స్క్రీన్ లాక్ రక్షణ కోసం మీరు కనీసం 6 అంకెల PIN లేదా బలమైన పాస్ వర్డ్ ను ఉపయోగించండి.
ఫోన్ తయారీదారులు మరియు ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ సంస్థలు భద్రతా లోపాలను సరిచేయడానికి తరచుగా కొత్త అప్ డేట్స్ విడుదల చేస్తుంటాయి. పాత సాఫ్ట్ వేర్ ను ఉపయోగించడం వల్ల మీ ఫోన్ సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. అందుకే, రెగ్యులర్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయడం మరిచిపోకండి.
కొన్ని హానికరమైన యాప్ లు సాధారణ యాప్ ల మాదిరిగా కనిపిస్తూ మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాయి. అందువల్ల మీరు యాప్ లను డౌన్‌లోడ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే, Android ఫోన్ యాప్స్ కోసం Google Play Store కోసం చూడండి మరియు iPhone కోసం Apple App Store కు ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా, WhatsApp లేదా SMS ద్వారా వచ్చిన తెలియని APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ స్టాల్ చేయవద్దు.
కొన్ని యాప్ లు వాటి పనికి అవసరం లేని అనుమతులను కూడా అడగవచ్చు. ఉదాహరణకు, సాధారణ కాలిక్యులేటర్ యాప్ కు మీ కాంటాక్ట్స్ లేదా మైక్రోఫోన్ అనుమతి అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి యాప్ అవసరాన్ని బట్టి యాప్ కి పర్మిషన్ ఇవ్వడం మంచిది. యాప్ పర్మిషన్ చెక్ చేయడానికి ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి Apps లేదా Privacy విభాగాన్ని తెరవండి. ఇక్కడ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్, కాంటాక్ట్, ఫోటోస్ వంటి అనుమతులను పరిశీలించండి మరియు అవసరం లేని అనుమతులు వెంటనే నిలిపివేయండి.
ఫోన్ ద్వారా జరిగే అనేక మోసాలు ఫేక్ SMSలు, WhatsApp మెసేజ్, ఇమెయిల్స్ లేదా ఫోన్ కాల్స్ తో ప్రారంభమవుతాయి. బహుమతి వచ్చిందని, బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని లేదా KYC అప్ డేట్ చేయాలని కల్లబొల్లి మాటలు చెప్పే మెసేజ్ లు మోసపూరితమైనవి కావచ్చు. కాబట్టి, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దు.
Also Read: Amazon GIF Sale: సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ సేల్ చేస్తోంది.!
మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు ఫోన్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. బలమైన స్క్రీన్ లాక్, క్రమం తప్పని సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, నమ్మకమైన యాప్‌లు, యాప్ అనుమతుల చెకింగ్ వంటి సాధారణ జాగ్రత్తలు మీ డిజిటల్ భద్రతను మెరుగుపరుస్తాయి.