బడ్జెట్ 5జి ఫోన్ HMD Vibe 2 Pro 5G సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది.!

HIGHLIGHTS

బడ్జెట్ 5జి ఫోన్ HMD Vibe 2 Pro 5G సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది

ony 64MP డ్యూయల్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది

బడ్జెట్ 5జి ఫోన్ HMD Vibe 2 Pro 5G సేల్ భారీ ఆఫర్స్ తో మొదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది మరియు ఈ రోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి భారీ డీల్ అండ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ Sony 64MP డ్యూయల్ కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది.

HMD Vibe 2 Pro 5G : ప్రైస్ అండ్ ఆఫర్స్

హెచ్ఎండి వైబ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ చాలా చవక ధరలో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ (6GB + 128GB) వేరియంట్ ని కేవలం రూ. 15,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ 8GB + 128GB) హై ఎండ్ వేరియంట్ ని రూ. 17,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది.

ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను ICICI అండ్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకునే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 14,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో ఈ ఫోన్ మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది.

Also Read: ప్రీమియం 55 ఇంచ్ QLED Smart Tv ని అతి చవక ధరలో కోరుకుంటే .. ఈ డీల్ మీ కోసమే.!

HMD Vibe 2 Pro 5G : ఫీచర్స్

హెచ్ఎండి వైబ్ 2 ప్రో ఆకట్టుకునే డ్యూయల్ టోన్ కలర్ లో వస్తుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను FHD ప్లస్ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు 8 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 os తో నడుస్తుంది మరియు 1 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ను Sony 64mp ప్రధాన కెమెరా జతగా 2mp మైక్రో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాతో అందించింది మరియు ఇందులో13mp సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో భారతీయ ఏఐ సర్వం ఏఐ తో నడిచే Indus ను అందించింది.

ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33 ఫాస్ట్ ఛార్జ్ ను ఆఫర్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బాక్స్ తో పాటు 33W ఫాస్ట్ చార్జర్ ని కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ మైక్ అండ్ డ్యూయల్ స్పీకర్ కలిగి ఉంటుంది. ఇది సంచార్ సాథీ సేఫ్టీ ని కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :