Amazon GIF Sale offers huge deals on 55 inch Samsung Mini LED smart tv
Amazon GIF Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేరుకుంది. 2026 దసరా పండుగ సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన ఈ బిగ్ పండుగ సేల్ నుంచి ఈరోజు కూడా జబర్దస్త్ ఆఫర్స్ ప్రకటించింది. ఇంటికి తగిన బిగ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారి కోసం ఈరోజు జబర్దస్త్ డీల్స్ అందించింది. ఈ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, సాధారణ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ అమెజాన్ ఆఫర్ చేస్తోంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో శాంసంగ్ ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసిన మినీ ఎల్ఈడి 4K Vision AI 2026 స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు 23% డిస్కౌంట్ తో రూ. 45,990 ప్రైస్ తో లిస్ట్ చేసిన అమెజాన్, ఈ స్మార్ట్ టీవీ పై మరో రెండు బిగ్ డీల్స్ కూడా అందించింది.
డీల్స్ విషయానికి వస్తే, ఈ టీవీపై రూ. 2,550 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,500 రూపాయల భారీ SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 41,940 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. అఫర్ ప్రైస్ చెక్ చేయడానికి మరియు ఈ టీవీని కొనుగోలు చేయడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని సగం ధరకే అందుకోండి .. ఎక్కడంటే.!
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన మినీ ఎల్ఈడి HDR ప్యానల్ ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్, సుప్రీం మినీ ఎల్ఈడి డిమ్మింగ్, కాంట్రాస్ట్ ఎన్ హెన్సర్, 4K అప్ స్కేలింగ్ కలర్ బూస్టర్ మరియు HDR 10+ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే మరియు అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. మినీ ఎల్ఈడి ప్రాసెసర్ 4K తో పని చేస్తుంది. ఇది ల్యాగ్ ఫ్రీ మరియు వేగవంతమైన పెర్ఫార్మెన్స్ ఈ టీవీకి అందిస్తుంది.
ఇక సౌండ్ పరంగా, ఈ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ వంటి ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో 3 HDMI, 1 USB-A, LAN, ఆప్టికల్ అవుట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.