amazon offers big deals on Sony 5.1 Dolby form gif sale 2026
అమెజాన్ ఇండియా లేటెస్ట్ పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నుంచి ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ ని అందించింది. ఈ డీల్స్ నుంచి ఒక ప్రత్యేకమైన సౌండ్ బార్ డీల్ ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అదేమిటంటే, సోనీ యొక్క బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ పై ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించి కేవలం బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ ప్రత్యేకమైన డీల్ ని ఈరోజు మీకోసం అందిస్తున్నాం. Sony 5.1 Dolby సౌండ్ బార్ పై అమెజాన్ ప్రత్యేకంగా అందించిన ఆ పండగ ఆఫర్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించిన బెస్ట్ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా చెప్పవచ్చు. అదేమిటంటే, సోనీ యొక్క ప్రఖ్యాత బడ్జెట్ సౌండ్ బార్ HT-S20R రియల్ 5.1 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ నిన్నటి వరకు రూ. 17,989 రూపాయల ధరలో సేల్ కాగా, అమెజాన్ ఈ సౌండ్ బార్ ని ఈరోజు రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 14,989 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.
అదనంగా, ఈ సౌండ్ బార్ పై రూ. 1,750 రూపాయల SBI బ్యాంక్ క్రెడిట్ కార్డు అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 13,239 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఆఫర్ చెక్ చేయడానికి మరియు కొనుగోలు చేయడానికి Buy From Here లింక్ పై క్లిక్ చేయండి.
Also Read: LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్స్ తో అతి చవక ధరలో లభిస్తోంది.!
ఇది టీవీలు, సినిమా, సంగీతం మరియు గేమింగ్ కోసం సోనీ రూపొందించిన లేటెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు 400W పవర్ అవుట్‌పుట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ముందువైపు సౌండ్ బార్, వెనుక రెండు స్పీకర్లు మరియు సబ్ వూఫర్ తో జతగా వస్తుంది. ఇది సినిమా థియేటర్ తరహా ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఇది డిజిటల్ ఆమ్ప్లిఫైర్ మరియు S-Master ఫీచర్ తో వస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. అలాగే, సౌండ్ ని మార్చు కోవడానికి వీలుగా ఇందులో అదనపు ఆడియో మోడ్స్ కూడా ఉన్నాయి. ఇది HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫీచర్ తో ఈ సౌండ్ బార్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ మరియు మరిన్ని పరికరాలతో చాలా ఈజీగా కనెక్ట్ చేయడానికి అవకాశం అందిస్తుంది. ఈ సౌండ్ బార్ తో మీరు గొప్ప సినిమా అనుభూతిని అందిస్తుంది.