Vivo T5 5G: వివో టి సిరీస్ అప్ కమింగ్ ఫోన్ అదిరింది.!

HIGHLIGHTS

వివో టి సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజర్ విడుదల చేసింది

వివో టి5 ప్రో బేసిక్ వెర్షన్ ఫోన్ గా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని అందిస్తుంది

ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుందని టీజర్ టీజర్ ద్వారా వెల్లడించింది

Vivo T5 5G: వివో టి సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజర్ విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి ముందుగా అందించిన ప్రీమియం ఫోన్ వివో టి5 ప్రో బేసిక్ వెర్షన్ ఫోన్ గా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని అందిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుందని టీజర్ టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ డిజైన్ చూస్తుంటే, వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని అనిపిస్తుంది.

Vivo T5 5G: లాంచ్ డేట్

వివో టి5 స్మార్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు ‘కమింగ్ సూన్’ ట్యాగ్ లైన్ అందించింది. ఈ ఫోన్ సెప్టెంబర్ నెల మొదటి రెండు వారాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి.

Vivo T5 5G: టీజర్ అండ్ అంచనా ఫీచర్స్

వివో టి5 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం వివో అందించిన టీజర్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ రివిల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కంప్లీట్ కర్వుడ్ డిజైన్ తో లాంచ్ చేస్తుంది. అంటే, ఇందులో ముందు కర్వుడ్ స్క్రీన్ మరియు వెనుక కర్వుడ్ బ్యాక్ ప్యానల్ ఉంటాయి. ఈ ఫోన్ ను వేగవంతమైన AI సపోర్ట్ కలిగిన లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేయనున్నట్లు వివో టీజింగ్ చేసింది.

ప్రస్తుతానికి, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన టీజర్ లో ఈ విషయాలు మాత్రమే వెల్లడించింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Also Read: POCO M8x 5G ట్యాబ్లెట్ లాంటి బిగ్ స్క్రీన్ మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో వచ్చింది.!

అంచనా ఫీచర్స్ ఏమిటి?

ఈ సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన టి5 ప్రో స్మార్ట్ ఫోన్ వంటి ప్రీమియం ఫీచర్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్ పెద్ద 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ ఫోన్ మీడియాటెక్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ప్రజెంట్ నడుస్తున్న లాంగ్ బ్యాటరీ ట్రెండ్ ఈ ఫోన్ లో కూడా ఫాలో అయ్యే అవకాశం. ఈ ప్రకారం, ఈ ఫోన్ కూడా శక్తివంతమైన 50MP మెయిన్ కెమెరా మరియు లేటెస్ట్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. అయితే, ఇవి అంచనా ఫీచర్స్ అని గమనించాలి.

ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ త్వరలోనే వివో వెల్లడించే అవకాశం ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :